
Mana Enadu : బాలీవుడ్ బ్యూటీ, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ( Aishwarya rai) అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. వయసు పెరుగుతున్న కొద్ది ఆమె అందం ఏమాత్రం చెక్కు చెదరడం లేదు. ఆమె అందానికే కాదు.. తెలివికి కూడా ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. ఈ బ్యూటీకి కేవలం ఇండియాలోనే కాదు.. అంతర్జాతీయంగానూ చాలా పాపులారిటీ ఉందన్న విషయం తెలిసిందే. ఇక ఈ భామను నటనలోనే కాకుండా ఫ్యాషన్ పరంగా కూడా చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు.
ఐష్ లెహంగాకు అరుదైన గౌరవం
చాలా మంది అమ్మాయిలు ఐష్ డ్రెస్సింగ్ ను ఫాలో అవుతంటారు. తాజాగా ఈ భామ డ్రెస్సింగ్ ఓ అరుదైన గౌరవం దక్కింది. 2008 విడుదలై సూపర్ హిట్ మూవీ ‘జోధా అక్బర్ (Jodhaa Akbar Movie)’ గురించి తెలియని వారుండరు. హృతిక్ రోషన్ తో జంటగా నటించిన ఈ సినిమాలో ఐశ్వర్య ధరించిన లెహెంగాలు ఇప్పటికీ ఫేమసే. ఆ లెహంగాల కోసమే చాలా మంది అమ్మాయిలు ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూశారంటే అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమాలో ఐశ్వర్య ధరించిన ఓ లెహంగా ఇప్పుడు అరుదైన గౌరవం దక్కించుకుంది.
అకాడమీ మ్యూజియంలో ఐష్ లెహంగా
ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ మ్యూజియం (Academy Museum)లో జోధా అక్బర్ లో ఐశ్వర్య ధరించిన రెడ్ కలర్ లెహంగాను ఉంచనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ అకాడమీ తన అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు పెట్టింది. “జోధా అక్బర్ సినిమాలో రాణికి ఈ లెహెంగా మరింత అందాన్ని తెచ్చింది. సిల్వర్ స్క్రీన్ పై ఎంతో మందిని అట్రాక్ట్ చేసిన ఈ లెహెంగానూ ప్రముఖ ఆస్కార్ మ్యూజియంలో ప్రదర్శించనున్నాం. ఇది చరిత్రలో నిలిచిపోతుంది” అని అకాడమీ తమ సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చింది.
A lehenga fit for a queen, designed for the silver screen.
In JODHA AKBAR (2008), Aishwarya Rai Bachchan’s red wedding lehenga is a feast for the eyes: vibrant zardozi embroidery, centuries-old craftsmanship, and a hidden gem—quite literally. Look closely and you’ll spot a… pic.twitter.com/UfUYxTeP22
— The Academy (@TheAcademy) December 24, 2024
ఇంతకంటే అందాన్ని కనిపెట్టగలరా?
ఇక ఈ పోస్టు చూసి ఐష్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. రాణికి క్వీన్ మూమెంట్ ( Aishwarya rai Queen Moment) అంటే ఇదేనంటూ కామెంట్లు చేస్తున్నారు. “డియర్ హాలీవుడ్ ఇంతకుమించిన అందాన్ని కనిపెట్టండి చూద్దాం” అంటూ ఓ నెటిజన్ సవాల్ విసరగా.. “అకాడమీ మ్యూజియం ఇకపై మరింత అందంగా కనిపిస్తుంది” అంటూ మరొక నెటిజన్ స్వీట్ కామెంట్ చేశాడు. అకాడమీ మ్యూజియంలో కనిపించనున్న మొదటి ఇండియన్ డ్రెస్ కూడా ఇదే కావడం విశేషం. ఈ లెహెంగాను నీతా లుల్లా అనే డిజైనర్ డిజ్ చేశారు.