2010లో రిలీజై ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న హాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ ‘కరాటే కిడ్ (Karate Kid)కు సీక్వెల్ రెడీ అయింది.(Karate Kid: Legends) పేరుతో రూపొందిన మూవీ ఈ నెలాఖరున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే అంతటా జోరుగా సాగుతున్నాయి.
ఈ సినిమా మే 30న దేశవ్యాప్తంగా రిలీజ్
కొలంబియా పిక్చర్స్ (Columbia Pictures) నిర్మించిన ఈ సినిమాలో జాకీ చాన్ (Jackie Chan), యుగ్ బెన్ వాంగ్ (Ben Wang), రాల్ఫ్ మచియో (Ralph Macchio) కీలక పాత్రలు పోషించారు. జోనాథన్ ఎంట్విస్ట్లే (Jonathan Entwistle) దర్శకత్వం వహించారు. ఈ సినిమా మే 30న దేశవ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.
ప్రధాన పాత్రలకు వాయిస్ ఓవర్
అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్రలకు బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ వేవ్‌గణ్ (Ajay Devgn), ఆయన కుమారుడు డబ్బింగ్ చెప్పడం విశేషం. జాకీచాన్ (Jackie Chan) పాత్రకు హిందీలో అజయ్ దేవ్గన్ డబ్బింగ్ చెప్పగా ఆయన కుమారుడు యుగ్ వేవ్‌గణ్ (Yug Devgan) సినిమాలో హీరో పాత్ర అయిన కథానాయకుడు లీ ఫాంగ్ పాత్రకు డబ్బింగ్ చెప్పారు. దీంతో యుగ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లయ్యింది. అంతేకాదు అజయ్ దేవగణ్ తన సినీ కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్ ఓ హాలీవుడ్ సినిమాకు డబ్బింగ్ చెప్పారు. తండ్రీ కోడుకులు కలిసి ఓ చిత్రానికి వాయిస్ ఇవ్వడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఒక్కసారిగా ‘కరాటే కిడ్: లెజెండ్స్’ (Karate Kid: Legends) చిత్రంపై హిందీలో అంచనాలు ఏర్పడ్డాయి.






