NATS 2025: తెలుగు వారంటే ఫైర్‌ అనుకున్నారా.. వైల్డ్‌ ఫైర్: అల్లు అర్జున్

అమెరికాలో జరిగిన ‘నాట్స్ (North America Telugu Society 2025)’ వేడుకల్లో టాలీవుడ్ తారలు(Tollywood stars) సందడి చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తనదైన ‘పుష్ప(Pushpa)’ స్టైల్ డైలాగులతో అక్కడి తెలుగు వారిలో ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు దర్శకులు రాఘవేంద్రరావు(Raghavendrarao), సుకుమార్(Sukumar), నటి శ్రీలీల, సమంత పాల్గొని అమెరికాలో ఉంటున్న తెలుగు వారిని ఉద్దేశించి మాట్లాడారు. విదేశాల్లోనూ తెలుగు వారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటూ కొనియాడారు.

నాట్స్ అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. “తెలుగు వారంటే ఫైర్‌(Fire) అనుకున్నారా.. వైల్డ్‌ ఫైర్(Wild Fire)” అంటూ తనదైన శైలిలో డైలాగ్ చెప్పి అభిమానులను ఉర్రూతలూగించారు. “నాట్స్ అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్” అని చమత్కరించారు. ఇంతమంది తెలుగు వారిని ఒకేచోట చూస్తుంటే హైదరాబాద్‌(hyderabad)లో ఉన్నట్లే ఉందని సంతోషం వ్యక్తం చేశారు. విదేశాల్లోనూ తెలుగు సంస్కృతిని కాపాడుతున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

నటి సమంత ఎమోషనల్

అభిమానులు(Fans) తనపై చూపిస్తోన్న ప్రేమ పట్ల నటి సమంత(Samantha) భావోద్వేగానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వేడుకల్లో పాల్గొన్న ఆమె, తనపై అభిమానులు కురిపిస్తున్న ఆదరణను తలచుకుని కంటతడి పెట్టుకున్నారు. తెలుగు ప్రేక్షకులు తనకు ఓ గుర్తింపునిచ్చి, కుటుంబంలా అండగా నిలిచారని చెబుతూ ఉద్వేగానికి గురయ్యారు. “నా తొలి చిత్రం ‘ఏ మాయ చేసావె’ నుంచి నన్ను మీ సొంత మనిషిలా ఆదరించారు. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు(Thanks) చెప్పడానికి నాకు 15 ఏళ్లు పట్టింది” అని అన్నారు. అభిమానుల ప్రేమకు గౌరవ సూచకంగా ఆమె వేదికపై నుంచే తలవంచి నమస్కరించారు. జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, పొరపాట్లు చేసినా ప్రేక్షకులు తన వెన్నంటే ఉన్నారని గుర్తుచేసుకున్నారు. సుకుమార్, రాఘవేంద్రరావు తదితరులు మాట్లాడారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *