మ్యాడ్ మూవీ ఫేమ్ అనంతిక సానిల్ కుమార్ (Ananthika Sanilkumar) ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్నమూవీ ‘8 వసంతాలు’ (8 Vasantalu). పలు షార్ట్ ఫిల్‌మ్స్తో ఆకట్టుకున్న ఫణీంద్ర నర్సెట్టి దర్శకుడు. మైత్రీ మూవీస్ బ్యానర్పై ప్రేమ కావ్యంగా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి సెకండ్ టీజర్ విడుదలైంది. హీరో పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం ఈ టీజర్ను పంచుకుంది. ‘ఊటీకి కొత్తగా వచ్చిన తెలుగు రచయిత. తను పదాలను ప్రేమతో రాస్తే తడిసిన గులాబీ పూలలా ఉంటాయి. అదే కసితో రాస్తే.. పిన్ పీకిన గ్రనేడ్గా ఉంటాయి’ అంటూ మొదలైన టీజర్ ఆసక్తిని పెంచుతోంది. ‘ప్రేమంటే మనం చేరాల్సిన గమ్యం కాదు.. చేయాల్సిన ప్రయాణం’ అంటూ హీరో సంభాషణతో టీజర్ను ముగించిన తీరు మెప్పిస్తోంది. ఆకట్టుకుంటున్న ఈ టీజర్ను మీరూ చూసేయండి.






