
అశ్విన్ కుమార్(Ashwin Kumar) తెరకెక్కించిన యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్ నరసింహ’(Mahavatar Narasimha) గురించే ప్రెజెంట్ అంతా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలిచింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పౌరాణిక యానిమేటెడ్ ప్రాజెక్ట్‌ను రూపొందించింది. పూర్తి స్థాయిలో యానిమేషన్‌తో రూపొందిన ఈ సినిమా థియేటర్లలోకి ఎలాంటి హైప్ లేకుండానే సైలెంట్‌గా అడుగుపెట్టినా, మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
కేవలం పది రోజుల్లోనే..
అంతేకాకుండా కలెక్షన్ల విషయంలోనూ కోట్లు కొల్ల కొడుతోంది. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ వంద కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. కేవలం పది రోజుల్లోనే రూ.105 కోట్లు కొల్లగొట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజ్ అయిన ఒక యానిమేటెడ్ సినిమా ఇంతటి కలెక్షన్లు రాబట్టడం విశేషం అనే చెప్పాలి.
Roaring past records with divine force 🦁❤️🔥#MahavatarNarsimha crosses 105 CRORES+ GBOC India, setting the box office ablaze with unstoppable momentum.
A divine phenomenon awaits you in cinemas.#Mahavatar @hombalefilms @AshwinKleem @kleemproduction @VKiragandur @ChaluveG… pic.twitter.com/LbEdQBZyjo
— Hombale Films (@hombalefilms) August 4, 2025