తిరుపతి తొక్కిసలాట ఘటనపై (Tirupati Stampede Case) డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్పందించారు. ఈ దుర్ఘటనపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనపై ఆయన ఏపీ ప్రజలను, తిరుమల భక్తులను క్షమాపణ కోరారు. తప్పు జరిగింది.. క్షమించండి.. బాధ్యత తీసుకుంటున్నాం.. అంటూ తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఇంత మంది అధికారులున్నా.. ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం సరికాదని పేర్కొన్నారు.
భక్తులను కంట్రోల్ చేయలేరా..
“బాధితులను క్షమించమని వేడుకున్నాం. తప్పు జరిగింది.. బాధ్యత తీసుకుంటాం అని చెప్పాం. ఎప్పుడూ ఇలాంటి దుర్ఘటన జరగలేదు. పోలీసులకు క్రౌడ్ మేనేజ్మెంట్ అలవాటు కాలేదు. భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో విఫలమయ్యారు. అధికారుల తప్పులకు మేం తిట్లు తింటున్నాం. తొక్కిసలాట జరిగినప్పుడు పోలీసులు.. భక్తులను కంట్రోల్ చేయలేరా? ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి పూర్తిగా విఫలమయ్యారు.” అని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు.
నిన్న రాత్రి బైరాగిపట్టెడలోని పద్మావతి పార్కు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో, ఈరోజు మధ్యాహ్నం ఆ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన డిప్యూటీ సీఎం శ్రీ @PawanKalyan గారు. ప్రమాదం జరిగిన తీరును, కారణాలను జాయింట్… pic.twitter.com/XD2P8ebTfu
— JanaSena Party (@JanaSenaParty) January 9, 2025
అభిమానులు, పోలీసులపై ఫైర్
మరోవైపు అభిమానులు, పోలీసుల తీరుపై కూడా పవన్ కల్యాణ్ (Pawan Kalyan On Tirupati News) ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషులు చనిపోయినా బాధ్యతగా వ్యవహరించరా అంటూ ఫైర్ అయ్యారు. అధికారుల తీరు కారణంగా సీఎం చంద్రబాబుకు చెడ్డపేరు వస్తోందని ధ్వజమెత్తారు. అధికారులు తక్షణమే మేల్కోవాలని సూచించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని కుట్ర జరిగిందేమోనన్న అనుమానం కలుగుతుందని వ్యాఖ్యానించారు.








