
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన ‘అఖండ 2: తాండవం(Akhanda 2: Tandavam)’ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది. ఈ చిత్రానికి బాలకృష్ణ తన డబ్బింగ్(Dubbing) పనులను పూర్తి చేశారని చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ప్రకటించింది. బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, బ్లాక్‌బస్టర్ ‘అఖండ’కు సీక్వెల్‌గా రూపొందుతోంది. ఈ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘సింహా(Simha)’, ‘లెజెండ్’, ‘అఖండ(Akhanda)’ చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి, ఇప్పుడు ‘అఖండ 2’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘‘సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు సర్వం సిద్ధం” అని చిత్రయూనిట్ ఎక్స్‌లో పేర్కొంది. దీంతో సినిమా విడుదలపై అభిమానుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు
కాగా ఇప్పటికే ఈ మూవీ డబ్బింగ్‌తో పాటు, రీ-రికార్డింగ్, విజువల్ ఎఫెక్ట్స్, సీజీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు నెలాఖరుకు అన్ని నిర్మాణాంతర పనులు పూర్తవుతాయని చిత్ర యూనిట్(Makers) తెలిపింది. సంయుక్తా మీనన్(Samyukta Menon) కథానాయికగా నటిస్తుండగా, ఆది పినిశెట్టి(Aadi Pinisetty) విలన్‌గా, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. తమన్(Thaman) సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు, ఎం.తేజస్విని నందమూరి సమర్పణలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈ ఆధ్యాత్మిక యాక్షన్ థ్రిల్లర్, జార్జియా, ప్రయాగ్‌రాజ్ కుంభమేళా లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపింది.
అంచనాలను అమాంతం పెంచేసిన టీజర్
బాలకృష్ణ పుట్టినరోజున(Balakrishna’s birthday) విడుదలైన ఈ సినిమా టీజర్ అంచనాలను ఆకాశమే హద్దుగా పెంచేసింది. ఈ మూవీ టీజర్ ఇప్పటికే 24 మిలియన్ వ్యూస్‌తో రికార్డు సృష్టించింది. శివుని వాహనమైన నంది, త్రిశూలం వంటి అంశాలతో బాలయ్యను ఉగ్రమైన, దైవిక అవతారంలో చూపించడం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేసిన భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయని అభిమానులు ఆశిస్తున్నారు.
‘GOD OF MASSES’ #NandamuriBalakrishna completes dubbing for #Akhanda2 ❤🔥
This duo is set to deliver a 4X BLOCKBUSTER. The Thaandavam is going to be massive, beyond your imagination 🔥
The post-production is in full swing. All set for a grand release on September 25th 💥💥… pic.twitter.com/rsfPKh24BB
— 14 Reels Plus (@14ReelsPlus) August 8, 2025