బిగ్‌బాస్ 7 సీజన్ కంటెస్టెంట్ శుభశ్రీ రాయగురు (Subhashree Rayaguru) తన ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. మనోభావాలు పాపగా ఫేమస్ అయిన ఈ బ్యూటీకి తన ప్రియుడు, నటుడు, నిర్మాత అజయ్ మైసూర్‌కు శుక్రవారం నిశ్చితార్థం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను శుభశ్రీ (Subhashree) తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫైనల్లీ.. మా ఎంగేజ్‌మెంట్ జరిగిందని క్యాప్షన్ జోడించింది.
కాబోయే దంపతులకు సినీప్రముఖుల శుభాకాంక్షలు
శుభశ్రీ ఇటీవలే ‘మేజెస్టీ’ అనే పాటలో తళుక్కుమంది. ఈ పాటలో ప్రియుడు అజయ్‌తో కలిసి నటించింది. ఆ పాటలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు చూపించారు. ఇప్పుడు రియల్ లైఫ్‌లోనూ పెళ్లికి సిద్ధపడటం విశేషం. వీరి నిశ్చితార్థం న్యూస్ తెలిసిన అభిమానులు, బుల్లితెర నటులు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సహ బిగ్‌బాస్ కంటెస్టెంట్లు సోహేల్ (Sohel), టేస్టీ తేజ, రోల్ రైడా, యావర్ హాజరై శుభశ్రీ–అజయ్ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
View this post on Instagram






