ManaEnadu : బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone)- రణ్వీర్ సింగ్ (Ranveer Singh) ఈ ఏడాది పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ జంట ఇప్పటి వరకు తమ కుమార్తెను బయటి ప్రపంచానికి పరిచయం చేయలేదు. అలాగే ఆమె పేరునూ ప్రకటించలేదు. తాజాగా ఈ జంట తమ ముద్దుల తనయ పేరును సోషల్ మీడియా వేదికాగ అనౌన్స్ చేసింది.
దువా పదుకొణె సింగ్
ఈ పసిపాపకు దువా పదుకొణె సింగ్ (Dua Padukone Sing) అని నామకరణం చేసినట్టు దీప్ వీర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘దువా అంటే ప్రార్థన అని అర్థం. మా ప్రేయర్స్కు సమాధానమే ఈ పసిపాప’’ అని పేర్కొంటూ చిన్నారి కాళ్లను ఫొటో తీసి ఈ జంట నెట్టింట షేర్ చేసింది. ఈ పోస్టుకు సినీ ప్రముఖులు ఆలియా భట్, మమితా బైజు, షాలినీ పాండేతో పాటు నెటిజన్లు కూడా స్పందించారు. సో క్యూట్ అంటూ హార్ట్ ఎమోజీలు షేర్ చేశారు.
దీప్-వీర్ సినిమా అప్డేట్స్ ఇవే
ఇక రణ్వీర్- దీపికా 2018లో వివాహ బంధం(Deepika Ranveer Marriage)లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబరులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే దీపావళి పండుగను పురస్కరించుకుని చిన్నారి పేరును అనౌన్స్ చేశారు. ఇక దీపికా.. సింగమ్ అగైన్ (Singham Again) తో ఈ శుక్రవారం రోజునే ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ మూవీలో రణ్ వీర్ సింగ్ క్యామియో చేశారు. ఇక రణ్ వీర్ సింగ్ ప్రస్తుతం ‘ధురంధర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు.
View this post on Instagram






