బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్(Salman Khan)కు మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. ప్రతిసారి డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరించిన దుండగులు ఈసారి మాత్రం స్టార్ హీరో కారును పేల్చేస్తామంటూ బెదిరించినట్లు తెలిసింది. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఈ విషయం ఇప్పుడు బాగా వైరల్ కావండతో సల్లూ భాయ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
మళ్లీ బెదిరింపులు
కొంతకాలంగా హీరో సల్మాన్ ఖాన్కు వరుస బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు బెదిరింపులు ఎదురయ్యాయి. గతంలో ఏకంగా ఆయన అపార్ట్మెంట్ బాల్కనీపై కాల్పులు కూడా జరిపారు నిందితులు. ఈ వ్యవహారంపై పోలీసులు మమ్ముర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు మరోసారి బెదిరింపులు రావడం ఇప్పుడు బాలీవుడ్ లో చర్చనీయాంశమవుతోంది.






