రేవంత్.. నువ్వు మగాడివి అయితే నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో చర్చ పెట్టు: KTR

తెలంగాణలో ప్రస్తుతం చర్చంతా బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఫార్ముల ఈ రేస్ కేసు(Formula E race case)పైనే నడుస్తోంది. ఫార్ములా ఈ-రేస్‌ వ్యవహారంలో మంగళవారం గంటగంటకూ వ్యవహారం మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇష్యూపై KTR మీడియాతో మాట్లాడారు. ఒక పాత సామెత చిన్నప్పటి నుంచి వింటున్నామని, అవినీతి పరులు ప్రతిచోటా అదే జరుగుతుంది అనుకుంటారన్నారు. ఉదయం నుంచి కాంగ్రెస్(Congress) నాయకులు ఏదో హడావుడి చేస్తున్నారని, ఏమి లేకున్నా నా మీద లొట్టపీసు కేస్(Case) పెట్టారని ఆయన విమర్శించారు.

విచారణకు లాయర్లను తీసుకెళ్తా..

అంతేకాదు.. అవినీతి(Corruption) లేదని తెలిసి కూడా నామీద కేసు పెట్టి శునకానందం పొందతున్నారని KTR మండిపడ్డారు. రాజ్యాంగపరంగా ప్రతి హక్కు(Rights)ను వినియోగించుకుంటానని ఆయన స్పష్టం చేశారు. నా మీద కేస్ పెట్టిన చిట్టి నాయుడుకి ఒక విషయం చెప్పాలని, నేను ACB ఆఫీసుకు వెళ్లినా నన్ను ప్రశ్నించడానికి భయపడ్డారన్నారు. మేము కోర్టు కు వెళ్ళామని, హైకోర్టు(Highcourt)లో మేము వేసిన క్వాష్ పిటిషన్(Quash Petition) కొట్టివేశారన్నారు. మేము సుప్రీంకోర్టు(Supreme Court)కు వెళ్లామని, రెండు మూడు రోజుల్లో విచారణకు వస్తుందన్నారు. నేను విచారణకు వెళితే లాయర్లను తీసుకెళ్తానని, అందుకోసం రేపు హైకోర్టుకు వెళ్తున్నానని ఆయన పేర్కొన్నారు.

అసెంబ్లీలో ఎందుకు చర్చపెట్టలేదు?

కొందరు మంత్రులు న్యాయమూర్తులలాగా మాట్లాడుతున్నారని, రేపు హైకోర్ట్ అనుమతి ఇస్తే ఎల్లుండి లాయర్లతో కలిసి విచారణకు వెళ్తానని కేటీఆర్‌ వెల్లడించారు. ED విచారణకు కూడా వెళ్తానని, హైకోర్టు నేను తప్పు చేశాను అని చెప్పలేదన్నారు. కేవలం విచారణ చేయమని చెప్పారని, ఈ విషయంపై అసెంబ్లీ(Assembly)లో చర్చ పెట్టమంటే పెట్టలేదన్నారు. ‘నువ్వు మగాడివి అయితే నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో చర్చ పెట్టు వస్తానని సీఎం రేవంత్‌కు సవాల్‌ విసిరారు కేటీఆర్‌. నా మీద ఎన్ని కక్ష సాధింపు చేసినా ఏమి చేయలేరన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *