Suryakumar Yadhav: సూర్యకుమార్‌కు సర్జరీ.. త్వరలోనే తిరిగి వస్తానని ప్రకటన

టీమ్ఇండియా(Team India) టీ20 క్రికెట్ జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్‌(Suryakumar Yadhav)కు సర్జరీ జరిగింది. కొంతకాలంగా సూర్య స్పోర్ట్స్ హెర్నియా(Sports Hernia) సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు కుడివైపు పొత్తికడుపు కింది భాగంలో వైద్యులు సర్జరీ నిర్వహించారు. ఈ విషయాన్ని సూర్యకుమార్ సోషల్ మీడియా(Social Media) ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తనకు శస్త్రచికిత్స(Surgery) సజావుగా జరిగిందని, ప్రస్తుతం కోలుకుంటున్నానని SKY తెలిపాడు.

బంగ్లాదేశ్ సిరీస్‌కు దూరం

“నాకు స్పోర్ట్స్ హెర్నియాకు సంబంధించి కుడివైపు పొత్తికడుపు కింది భాగంలో శస్త్రచికిత్స జరిగింది. సర్జరీ సాఫీగా పూర్తయినందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుతం కోలుకుంటున్నాను. మళ్లీ మైదానం(Ground)లోకి తిరిగి రావడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను” అని సూర్య‌ తన పోస్టులో పేర్కొన్నాడు. కాగా T20 టీమ్ కెప్టెన్‌(Captain)గా, టీ20 ఫార్మాట్‌లో కీలక ప్లేయర్‌గా ఉన్నాడు. గాయం కారణంగా వచ్చే ఆగస్టులో జరిగే బంగ్లాదేశ్(Bangladesh) సిరీస్‌కు సూర్య దూరం కానున్నట్లు సమాచారం. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్(Shreyas Ayyar) కెప్టెన్సీ చేసే ఛాన్సుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *