ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించి పుష్ప-2(Pushpa2) ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. రిలీజ్ అయి(DEC 5th) దాదాపు 50 రోజులకు చేరువలో ఉన్న బన్నీ(Bunny) మూవీపై మాత్రం అభిమానుల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంక్రాంతి(Sankranthi)కి కొత్త సినిమాలు రిలీజ్ అవడంతో దాదాపు అన్ని థియేటర్లలోనూ దాదాపు వెళ్లిపోయింది. కానీ నార్త్‌లో మాత్రం పుష్పరాజ్ వైల్డ్ ఫైర్ కొనసాగుతూనే ఉంది. తాజాగా పుష్ప టీమ్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. అధిక టికెట్ రేట్ల(Ticket Rates) కారణంగా థియేటర్లలో సినిమా మిస్ అయిన వారు చూసేందుకు వీలుగా టికెట్ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. నైజాంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.112, మల్టీప్లెక్స్‌లలో రూ.150గా ఫిక్స్ చేసినట్లు తెలిపింది. మరోవైపు నార్త్ ఇండియాలో రూ.112కే టికెట్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
Celebrate Cinema Lovers Day with #Pushpa2TheRule RELOADED VERSION on January 17th 💥💥
Watch INDIAN CINEMA’S INDUSTRY HIT at pocket friendly prices in Nizam ❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/eJusnmNS6Y #Pushpa2 #WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika… pic.twitter.com/6Q3dFHJ3Tb
— Pushpa (@PushpaMovie) January 15, 2025
సినిమా లవర్స్ డే అంటూ ఆఫర్
ఇదిలా ఉండగా నేటి నుంచి (జనవరి 17) పుష్ప-2 సినిమాకు మరో 20 నిమిషాల సీన్స్ జత చేసిరీ లోడెడ్ వెర్షన్(ReLoaded Version)అంటూ మళ్లీ థియేటర్స్‌లోకి విడుదల చేస్తున్నారు. ఆల్రేడీ చాలా థియేటర్లలో ‘సంక్రాంతి’ సినిమాలు ఉన్నాయి కాబట్టి దొరికిన థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు ఏఏ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారో కూడా పుష్ప టీమ్ ట్వీటర్(X) వేదికగా వెల్లడించింది. మరోవైపు నార్త్‌లో మాత్రం రిలీజ్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. జనవరి 17న సినిమా లవర్స్ డే అంటూ టికెట్ రేట్లు భారీగా తగ్గించి స్పెషల్ ఆఫర్(Special Offer) పెట్టింది పుష్ప టీమ్.
#Pushpa2TheRule with 20 extra minutes of WILDFIRE starts roaring from Jan 17th 🪓🪓🔥🔥
Here’s the theatres list 🧨🧨💥💥#Pushpa2 #WildFirePushpa pic.twitter.com/8f3YMHDI39
— Pushpa (@PushpaMovie) January 15, 2025
రూ.2000 కోట్ల క్లబ్‌లో చేరుతుందా?
ఇదిలా ఉండగా డైరెక్టర్ సుకుమార్(Director Sukumar) తెరకెక్కించిన పుష్ప-2లో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించగా.. సునీల్, జగపతిబాబు, రావు రమేష్, అనసూయ, ఫహద్ ఫాజిల్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ప్రీమియర్స్ నుంచి భారీ హిట్ టాక్ సొంతం చేసుకున్న పుష్పరాజ్ రికార్డు స్థాయిలో కలెక్షన్లు(Collections) రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1850 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాహుబలి 2 రికార్డు కూడా బద్దలు కొట్టింది. అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన ఇండియన్ సినిమాగా అమీర్ ఖాన్ దంగల్(Dangal) 2000 కోట్లతో ఉండగా ఆ రికార్డ్ కూడా బద్దలు కొట్టాలనే ప్లాన్‌తో ఉంది పుష్ప 2 మూవీ యూనిట్.






