మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), స్టార్ డైరెక్టర్ శంకర్(Director Shankar) కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్త్ మూవీ ‘గేమ్ ఛేంజర్(Game Changer)’. ఈ మూవీ రేపు ప్రేక్షకులకు ముందుకు వస్తోంది. ‘RRR’ సినిమాతో రామ్ చరణ్ రేంజ్ తారాస్థాయికి చేరుకుంది. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు చరణ్ కెరీర్లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్(Biggest Hit) అవుతుందని అభిమానులు భారీ ధీమాతో ఉన్నారు.
ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా: సాయిదుర్గ తేజ్
ఇదిలా ఉండగా మూవీ రిలీజ్ సందర్భంగా చెర్రీ(Cherry)కి, మూవీ టీమ్‌కి హీరో సాయిదుర్గ తేజ్(Sai Durga Tej) ‘ఆల్ ది బెస్ట్(All The Best)’ చెప్పాడు. “చరణ్.. చాలా గ్యాప్ తర్వాత బిగ్ స్క్రీన్‌పై నిన్ను చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. డైరెక్టర్ శంకర్ సార్ విజన్‌ని జీవితంలోకి తీసుకొచ్చేందుకు నీవు చేసిన కృషికి ఆల్ ది బెస్ట్’ అంటూ ట్విటర్(X)లో పోస్ట్ చేశాడు. అలాగే దిల్ రాజు గారికి ఈ సంక్రాంతి(Sankranti) బ్లాక్ బస్టర్ అవుతుంది. తమన్, SJ సూర్య, కియారా అద్వానీ(Kiara Advani), అంజలి, శ్రీకాంత్‌లకు ఈ మూవీ గ్రాండ్ రిలీజ్(Movie Grand Release) సందర్భంగా శుభాకాంక్షలు” అని ట్వీట్(Tweet) చేశాడు సాయి తేజ్.
దాదాపుగా 450 కోట్ల బడ్జెట్‌తో..
దాదాపుగా 450 కోట్ల బడ్జెట్(Budget)తో ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు(Dil Raju) నిర్మించాడు. అయితే శంకర్ సినిమాలోని పాటలకి కచ్చితంగా ఎదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దీంతో సినిమాలోని పాటల(Songs)కి మాత్రమే రూ.75 కోట్లు ఖర్చు చేయడం విశేషం. అయితే ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం మొదటి రోజు గేమ్ ఛేంజర్ బాక్సాఫిస్(Box Office) వద్ద డీసెంట్ ఓపెనింగ్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా ఫస్ట్ డే దాదాపుగా రూ.175 నుంచి రూ.200 కోట్లు కలెక్ట్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఓవర్సేస్ కలుపుకుని అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్స్(Advance Bookings) మొదలయ్యాయి. మీరూ టికెట్(Ticket) బుక్ చేశారా?
Charann! Extremely excited to witness your phenomenon on the big screen with #GameChanger after such a long gap. All the best @AlwaysRamCharan for all your incredible efforts and patience in bringing @shankarshanmugh sir’s vision to life
May this be a blockbuster Sankranthi… pic.twitter.com/5NHn0XwXGm
— Sai Dharam Tej (@IamSaiDharamTej) January 9, 2025






