‘సునీత విలియమ్స్ జర్నీ.. ఓ అడ్వెంచర్ థ్రిల్లర్’

ఎనిమిది రోజుల్లో పూర్తి కావాల్సిన వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita Williams), బుచ్‌ విల్మోర్‌ అంతరిక్ష (ISS) ప్రయాణం సాంకేతిక సమస్యల వల్ల తొమ్మిది నెలలపాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు తొమ్మిది నెలల అనంతరం వారు సురక్షితంగా భూమ్మీదకు చేరుకున్నారు. దీంతో వారికి ప్రజలంతా ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు వారికి వెల్‌కమ్‌ చెబుతూ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

మీ జర్నీ ఓ అడ్వెంచర్ థ్రిల్లర్

‘‘భూమ్మీదకు తిరిగి స్వాగతం సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌. ఇది చారిత్రక ఘట్టం. 8 రోజుల్లో తిరిగిరావాలని వెళ్లి 286 రోజుల తర్వాత తిరిగొచ్చారు. 4577 సార్లు భూమి చుట్టూ తిరిగారు. మీరు చాలా గొప్ప ధైర్యవంతులు. మీకు ఎవరూ సాటిలేరు. మీ (Sunita Williams Returns) ప్రయాణం ఒక థ్రిల్లర్‌ అడ్వెంచర్‌ మూవీని తలపిస్తోంది. ఇదో గొప్ప అడ్వెంచర్. నిజమైన బ్లాక్‌బస్టర్‌’’ అంటూ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

మా ప్రార్థనలు ఫలించాయి

‘‘మా పూజలు ఫలించాయి. సునీత.. మీరు సురక్షితంగా భూమ్మీదకు చేరుకున్నారు. మీరు ఇలా నవ్వుతూ రావడం చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. 286 రోజులు అంతరిక్షంలో ఉండి దేవుడి దయతో లక్షలాది మంది ప్రార్థనల వల్ల భూమ్మీదకు తిరిగి వచ్చారు. మిమ్మల్ని తిరిగి తీసుకువచ్చేందుకు శ్రమించిన సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు. దేవుడి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలి’’ అంటూ ఎవర్ గ్రీన్ నటుడు ఆర్‌. మాధవన్‌ (R. Madhavan) పేర్కొన్నారు.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *