Mana Enadu : మయోసైటిస్ వ్యాధి బారి నుంచి కోలుకుని ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) మళ్లీ వర్క్ మోడ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం సామ్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ సిరీస్ నవంబర్ 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం సమంత ఈ సిరీస్ ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
నవంబర్ 7న రిలీజ్
వరుణ్ ధావన్ (Varun Dhawan) ప్రధాన పాత్రలో ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ వెబ్ సిరీస్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్ (Citadel Honey Bunny)’కు రీమేక్‌గా తెరకెక్కింది. ప్రస్తుతం రిలీజ్ అయిన ట్రైలర్ సమంత నెవర్ సీన్ అవతార్ లో కనిపించింది. ఫుల్ యాక్షన్ ప్యాక్‌డ్‌గా సాగిన ట్రైలర్ లో సామ్ తన యాక్షన్ తో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
సమంత యాక్షన్ అదుర్స్
ట్రైలర్ లో సామ్ యాక్షన్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సమంత ఈ సిరీస్ లో అపరకాళీలా కనిపించబోతోందని అంటున్నారు. హిందీలోనూ ఈ భామ డైలాగ్స్ అదిరిపోయాయని, డబ్బింగ్ చాలా బాగా కుదిరిందని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. చాలా రోజుల తర్వాత సమంత నుంచి ఓ ప్రాజెక్టు వచ్చిందని, తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సిరీస్ లో .. కే కే మీనన్ (Kay Kay Menon), సిమ్రాన్, సాకిబ్ సలీమ్, సికందర్ ఖేర్, సోహమ్ మజుందార్, శివన్‌కిత్ పరిహార్, కష్వీ మజ్ముందర్ కీలక పాత్రల్లో నటించారు.