Odisha: దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న యువత.. ఊరిపెద్దలు ఏం చేశారంటే?

ఒడిశా(Odisha)లో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి(Love Marriage) చేసుకున్నందుకు ఓ జంటపై గ్రామస్థులు అమానుషంగా ప్రవర్తించారు. వారిని కాడెద్దులుగా నాగలికి కట్టి పొలం దున్నించారు. కంజామఝీరా గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారి ప్రేమను ఇంట్లో వారు అంగీకరించినా.. ఆ ఊరి సంప్రదాయం, కట్టుబాట్ల వల్ల ఊరిపెద్దలు అంగీకరించలేదు. అత్త కూతురిని పెళ్లి చేసుకోగా.. ఆ గ్రామంలో అత్త కూతురిని పెళ్లి చేసుకోవడం నిషేధం. ఇదే గ్రామస్థుల కోపానికి కారణమైంది. ఆ జంటను గ్రామస్థుల సమక్షంలో నిలబెట్టి, తీవ్రంగా అవమానించారు. అంతటితో ఆగకుండా అత్యంత దారుణంగా, వారిద్దరినీ నాగలికి కట్టి పొలం దున్నమని ఆదేశించారు. వారిని కర్రలతో కొడుతూ పొలం దున్నించారు.

పెద్దల మాటకు ఎదురు చెప్పలేక..

ఆ తర్వాత ఆలయంలో శుద్ధి కర్మలు చేయించారు. ఈ సంఘటనను కొందరు చూసి బాధపడినా, పెద్దల మాటకు ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోయారు. మరికొందరు దీన్ని ‘తప్పు చేసిన వారికి సరైన శిక్ష’గా భావించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు(Police) రంగంలోకి దిగారు. బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి అమానవీయ చర్యలు సమాజంలో జరగకుండా చూడాలని, ప్రేమించుకున్న జంటలకు రక్షణ కల్పించాలని సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల సంఘాలు(Human rights groups) డిమాండ్ చేశాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *