తుఫాన్​ ఎఫెక్ట్​.. చెన్నై ఎయిర్​పోర్ట్​ మూసివేత

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఫెంగల్ తుఫాను (Cyclone Fengal) తీవ్రతరమైంది. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెన్నై ఎయిర్‌పోర్టును (chennai airport) తాత్కాలికంగా మూసివేశారు. శనివారం సాయంత్రం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఎయిర్​పోర్టును మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలోనే 22 విమానాలను రద్దు చేసినట్లు తెలుస్తోంది.

ఫెంగల్ తుఫాను మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. తమిళనాడు, (Tamil nadu) పుదుచ్చేరి వైపు బలంగా దూసుకొస్తున్న తుఫాను కారణంగా తమిళనాడు వ్యాప్తంగా చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నై నగరం ఇప్పటికే జలమయమైంది. అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిన ప్రభుత్వం.. చెన్నై ((chennai) నగరంలోని స్కూళ్లు, కాలేజీలకు ఇప్పటికే సెలవు ప్రకటించింది. సాఫ్ట్‌వేర్ సంస్థలు, ప్రైవేటు ఉద్యోగులు కూడా ఇంటి నుంచే పనిచేసుకోవాలని సూచించింది.

భారీ వర్షాల నేపథ్యంలో చెన్నైలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. పలు ప్రాంతాలు పూర్తిగా వరద ముంపులో చిక్కుకున్నాయి. తుఫాను కారణంగా శుక్రవారం చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. మరికొన్ని విమానాలు ఆలస్యంగా ప్రయాణించాయి. చెన్నై ఎయిర్‌పోర్టులో తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo) ప్రకటించింది. అబుదాబి నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు వచ్చే ఇండిగో విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. ఇక సింగపూర్‌ నుంచి వచ్చే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని టెక్నికల్ సమస్య కారణంగా రద్దు చేశారు. చెన్నై నుంచి కొలంబో వెళ్లాల్సిన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రద్దు చేశారు.

https://twitter.com/airindia/status/1862706576672325740

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *