గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్(Game Changer)’ ప్రమోషన్స్(Promotions)లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి(Sankranthi) కానుకగా 2025 జనవరి 10న రిలీజ్ కానుంది. ఇటీవల లక్నోలో ఈ చిత్రం టీజర్ విడుదల వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈనేపథ్యంలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ప్రమోషన్స్ టూర్స్‌ను ప్లాన్ చేశారు మేకర్స్. ఈ మూవీలో చెర్రీకి జోడీగా అందాల భామ కియారా అద్వానీ(Kiara Advani) నటిస్తుండగా.. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shankar) దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్ లెజెండ్ తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో అంజలి, SJ సూర్య, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నారు.
డల్లాస్‌లో కలుద్దాం: రామ్ చరణ్
ఇదిలా ఉండగా ‘గేమ్ ఛేంజర్(Game Changer)’పై ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటి వరకు మరే సినిమా చేయని అద్భుతాన్ని ఆవిష్కరించనుంది. డిసెంబర్ 21న అమెరికాలో ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre Release Event) అత్యంత భారీగా జరగనుంది. డల్లాస్(Dallas)లోని కర్టిస్ కల్‌వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్, గార్‌లాండ్ TX 75040 వేదికగా జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. తాజాగా ఈ ప్రీరిలీజ్(Pre Release Event) ఈవెంటుకు సంబంధించి చెర్రీ ఓ వీడియోను ఎక్స్(X) వేదికగా రిలీజ్ చేశారు. ‘నమస్తే డల్లాస్.. మిమ్మల్ని గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చూసేందుకు చాలా ఆత్రుతగా ఉన్నాను’ అని చెర్రీ అన్నారు.
Dallas, looking forward to seeing you on December 21st!#Gamechanger pic.twitter.com/AOsvRcjIf6
— Ram Charan (@AlwaysRamCharan) December 19, 2024
మూడో పాట ప్రోమో కూడా వచ్చేసింది
ఇప్పటి వరకు సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ‘జరగండి జరగండి.. ’, ‘రా మచ్చా రా..’, ‘నా నా హైరానా’ సాంగ్స్‌కు, టీజర్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా దిల్ రాజు బర్త్ డే సందర్భంగా గేమ్ ఛేంజర్ మూడో పాట ‘డోప్’ ప్రోమోను కాసేపటి క్రితమే రిలీజ్ చేశారు. కాగా ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.






