
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక(Maharashtra assembly elections)ల్లో మహాయుతి కూటమి(Mahayuti alliance) ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే. అయితే ఫలితాలు వెలువడిన వారం రోజుల తర్వాత సీఎం ఎవరనేదానిపై సందిగ్ధం వీడింది. సీఎంగా దేవేంద్ర ఫడణవీస్(Devendra Fadnavis as CM) స్వీకారం చేయగా.. డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండే(Ajit Pawar and Eknath Shinde as Deputy CMs) ప్రమాణం చేశారు. డిసెంబర్ 5న వీరి ప్రమాణ స్వీకార కార్యక్రమం ముంబై ఆజాద్ మైదానం(Mumbai Azad Maidan)లో ఘనంగా జరిగింది.
ఇద్దరు డిప్యూటీ సీఎంల శాఖలు ఇవే
తాజాగా మహారాష్ట్రలో BJP నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం(Mahayuti Govt) నూతన మంత్రి వర్గాన్ని(The new cabinet) ప్రకటించింది. ఈ మేరకు హోమ్, ఎనర్జీ, లా, జనరల్ అడ్మిస్ట్రేషన్ శాఖలను సీఎం దేవేంద్ర ఫడణవీస్ తన వద్దే ఉంచుకున్నారు. ఇక డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేకు అర్బన్ డెవలప్‌మెంట్, హౌసింగ్ శాఖలను కేటాయించగా, మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు ఫైనాన్స్, ప్లానింగ్, స్టేట్ ఎక్సైజ్ శాఖలు ఇచ్చారు.
ఇక మిగతా శాఖలను ఆదివారం వరకు విడుదల చేస్తామని సీఎం ఫడణవీస్ తెలిపారు. కాగా 39 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా నవంబర్ 20 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి పార్టీ 230 స్థానాలు నెగ్గగా.. మహా వికాస్ అఘాడీ(Maha Vikas Aghadi) పార్టీ కేవలం 46 స్థానాలకే పరిమతమై ఘోర ఓటమి చవిచూసింది.