పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ‘సలార్’ మూవీ తర్వాత ఓకే చేసిన ఫస్ట్ సినిమా ‘ది రాజాసాబ్ (The Raja Saab)’. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై దాదాపుగా పూర్తైంది. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. కానీ అకస్మాత్తుగా సినిమా వాయిదా పడింది. అప్పటి నుంచి ఈ మూవీ నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. కానీ మేకర్స్ మాత్రం ఒక్క అప్డేట్ కూడా ఇవ్వడం లేదు. ఇటీవల ఇదే విషయంపై ఓ నెటిజన్ డైరెక్టర్ మారుతిని అడిగితే.. త్వరలోనే ప్రకటిస్తామంటూ చెప్పుకొచ్చారు.
HIGH ALERT…‼️
HEAT WAVES gonna rise even higher from mid May! 🔥🔥🔥 pic.twitter.com/EdEdtMCq6E— Director Maruthi (@DirectorMaruthi) April 23, 2025
రాజాసాబ్ హై అలర్ట్
అయితే తాజాగా డైరెక్టర్ మారుతి (Director Maruthi) డార్లింగ్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పారు. డిఫరెంట్ స్టైల్ లో ది రాజాసాబ్ మూవీ అప్డేట్ గురించి ఓ పోస్టు పెట్టారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రభాస్ ఫ్యాన్స్ కు ఓ స్వీట్ న్యూస్ చెప్పారు మారుతి. ఓ ఆటో వెనక ప్రభాస్ స్టిక్కర్ ఉన్న ఫొటో షేర్ చేసిన మారుతి.. ‘‘హై అలర్ట్. మే నెల మధ్యలో నుంచి వడగాలులు మరింత పెరిగే అవకాశం ఉంది’ అని క్యాప్షన్ రాసుకొచ్చారు. ‘రాజా సాబ్’ మూవీ అప్డేట్ గురించి ఆయన చేసిన ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ప్రభాస్ కెరీర్ లో స్పెషల్ మూవీ
ప్రభాస్ సినిమా కెరీర్ లోనే రాజాసాబ్ మూవీ చాలా స్పెషల్. ఎందుకంటే తొలిసారిగా డార్లింగ్ హారర్ కామెడీ జానర్ లో మూవీ చేస్తున్నాడు. ఇక మారుతి ఈ జానర్ లో దిట్ట అన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. రిద్ది కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) ఓ కీల్ రోల్ లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని నిర్మిస్తోంది.






