Mana Enadu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబోలో వస్తున్న మూవీ ‘SSMB 29’. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఇటు మహేశ్ బాబు ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ఒక్క అప్డేట్ కూడా రాలేదు. అయితే తాజాగా దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) తన ఇస్టాగ్రామ్ లో పెట్టిన ఒక్క పోస్టుతో ‘SSMB 29’ మూవీ మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
View this post on Instagram
‘SSMB29’ మూవీ టీమ్ ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలో రాజమౌళి ఈ సినిమా కోసం లొకేషన్స్ వెతికే పనిలో పడ్డారట. ఆయన తాజా పోస్టు చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది. ఓ ఎడారి ప్రాంతంలో ఆయన తిరుగుతున్నట్లు ఫొటో షేర్ చేసి.. “కనుగొనడం కోసం తిరుగుతున్నా” అంటూ క్యాప్షన్ యాడ్ చేశారు. ఇది చూసిన మూవీ లవర్స్ ఈ ఫొటో మహేశ్ బాబు (Mahesh Babu 29 Movie) సినిమా లొకేషన్స్ కు సంబంధించినదే అయి ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు.
అమెజాన్ అడవుల (Amazon Forest) నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ డ్రామాలో హాలీవుడ్ నటులు కూడా నటించనున్నట్లు సమాచారం. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తుండగా.. ఈ చిత్రానికి ‘గరుడ (Garuda)’ అనే టైటిల్ అనుకుంట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుందని రాజమౌళి తండ్రి, రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక మహేశ్ బాబు ఈ సినిమాలో తన పాత్ర కోసం పొడవాటి జుట్టు, గడ్డంతో రెడీ అవుతున్నారు.






