Mana Enadu : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు (US Election Results 2024) వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దూసుకెళ్తున్నారు. ఆయన విజయం దాదాపు ఖాయమైనట్లే. ప్రస్తుతం ఆయన మ్యాజిక్ ఫిగర్ (270)కు మరింత దగ్గరలో ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం దిశగా సాగుతుండటంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు సంబురాలు చేసుకుంటున్నారు.
ఈ విజయం ఊహించనిది
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని అన్నారు. అమెరికన్లకు స్వర్ణ యుగం రాబోతోందని తెలిపారు. ఎన్నికల యుద్ధంలో రిపబ్లికన్లు బాగా పోరాడారని ప్రశంసించారు. రిపబ్లికన్ పార్టీ (US Republican Party)కి 315 సీట్లు వచ్చే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. పాపులర్ ఓట్లలోనూ రిపబ్లికన్ పార్టీదే హవా అని హర్షం వ్యక్తం చేశారు.
ఇది అమెరికన్లు గర్వించే విజయం
“నాకు, నా పార్టీకి ఈ ఘన విజయం అందించిన అమెరికన్లకు ధన్యవాదాలు. ఇది అమెరికన్లు గర్వించే విజయం. అమెరికా కోలుకునేందుకు ఈ విజయం దోహదం చేస్తుంది. స్వింగ్ రాష్ట్రాల్లో (US Swing States) విజయం ఆనందాన్నిచ్చింది. ఈ స్థాయి విజయం సాధిస్తారని ఎవరూ ఊహించలేదు.” అని డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు.
#WATCH | West Palm Beach, Florida | Republican presidential candidate #DonaldTrump says, “…This is a movement that nobody has ever seen before. Frankly, this was, I believe, the greatest political movement of all time. There has never been anything like this in this country and… pic.twitter.com/MEcRDSAI72
— ANI (@ANI) November 6, 2024
స్టాక్ మార్కెట్కు ట్రంప్ జోష్
మరోవైపు వచ్చే నాలుగేళ్లలో అమెరికా తలరాతను నిర్ణయించే స్వింగ్ స్టేట్స్.. ఈ ఎన్నికల్లో ముక్తకంఠంతో రిపబ్లికన్లకే పట్టం కట్టాయి. అమెరికా ఎన్నికల ఫలితాల్లో కమలా హారిస్(Kamala Harris)పై రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ (Donald trump) విజయం ఖరారు కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలైన (Stock market) సెన్సెక్స్, నిఫ్టీ దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్లు లాభపడి తిరిగి మళ్లీ 80వేల మార్కు అందుకుంది. ఇంకోవైపు నిఫ్టీ సైతం 24,400 స్థాయి దాటింది.