
నేషనల్ క్రష్ రష్మిక(Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. భారతీయ సినిమా పరిశ్రమలో ‘నేషనల్ క్రష్(National Crush)’గా పేరుగాంచిన నటిగా గుర్తింపు పొందింది. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తూ పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగింది. పుష్ప, యానిమల్(Animal), పుష్ప-2(pushpa 2)తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘ఛావా(Chhavaa)’ మూవీతో మరో సక్సెస్ అందుకుంది. ఇక తాజాగా ఆమె నటించిన ‘కుబేర(Kuber)’ సినిమా మంచి విజయం సాధించింది. నాగార్జున ఈ సినిమా సక్సెస్ మీట్‌లో రష్మిక నటనను శ్రీదేవి(Sridevi) నటనతో పోల్చారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆమె టాలెంట్ ఏంటో..
స్టార్‌డమ్, గుర్తింపు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడి
కాగా రష్మిక ప్రస్తుతం హను రాఘవపూడి శిష్యుడు రవీంద్ర దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ ‘మైసా(Mysaa)’ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా పోస్టర్‌లో ఆమె చేతిలో బల్లెంతో అడవిలో నిలబడి ఉండటం ఆకట్టుకుంది. అలాగే, ‘ది గర్ల్‌ఫ్రెండ్(The Girl Friend)’ సినిమాతో ఆమె బిజీగా ఉంది, దీని ఫస్ట్ సింగిల్ రిలీజ్ త్వరలో ఉంటుందని సమాచారం. మరోవైపు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ‘ధామా(Dhama)’లో కూడా నటిస్తోంది. కాగా ఇటీవల తనకు లభించిన స్టార్‌డమ్, గుర్తింపు గురించి ఓ ఇంటర్వ్యూలో రష్మిక ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ఒకదాని కోసం మరొకటి త్యాగం చేయాల్సిందేనని అమ్మ చెప్పింది
‘ఫ్యామిలీ(Family)నే నా బలం. ఎక్కువ సమయం కుటుంబంతోనే గడిపేదాన్ని. నా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి రోజు చాటింగ్ చేసుకుంటాం. కానీ షూటింగ్స్ కారణంగా దాదాపు రెండేళ్లుగా ఇంటికి వెళ్లలేదు. చెల్లిని, ఇంట్లోవాళ్లని, స్నేహితులను కలవలేవలేదు. ముఖ్యంగా మా చెల్లిని చాలా మిస్ అవుతున్నా.. తను చాలా స్మార్ట్. రానున్న రోజుల్లో అద్భుతమైన మహిళగా మారనుందని నమ్ముతున్నా. వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలకు ఒకేసారి సమయాన్ని కేటాయించడం అంత సులభం కాదు. ఒకదాని కోసం మరొకటి త్యాగం చేయాల్సి ఉంటుంది అని మొదట్లోనే మా అమ్మ చెప్పింది. నా విషయంలో ఇప్పుడు అదే జరుగుతుంది. వృత్తిపరమైన కమిట్‌మెంట్స్ నిలబెట్టుకోవడానికి ఫ్యామిలీ టైమ్ త్యాగం చేయాల్సి వస్తోంది. వీలున్నప్పుడల్లా కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మాట్లాడుతుంటా’ అని రష్మిక చెప్పుకొచ్చింది.
View this post on Instagram