ఏడుగురుఐపీఎల్ ట్రోఫీ(IPL Trophy 2025) నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)కి అభిమానులు నీరాజనం పడుతున్నారు. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన రజత్ పాటీదార్ సేన తొలి టైటిల్ అందివ్వడంతో ఫ్యాన్స్ ఆనందంలో తడిసిముద్దవుతున్నారు. ఈ మేరకు నిన్న ట్రోఫీ నెగ్గిన ఆర్సీబీ ఇవాళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium)లో విజయోత్సవాలను నిర్వహిస్తామని తెలిపిన విషయం తెలిసిందే. అయితే తొలుత బెంగళూరు విధాన సౌధ నుంచి స్టేడియం వరకూ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించింది. ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో విక్టరీ సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు.
KARNATAKA DEPUTY CM WELCOMING KOHLI & RCB TEAM #RCBvsPBKS #IPL2025Final #RCBvsPBKSfinal #ViratKohli𓃵 pic.twitter.com/VfiPVK4Ksn
— Kalyani Nirbhawane 🇮🇳 (@KalyaniAmbedkar) June 4, 2025
భారీగా తరలివచ్చిన ఆర్సబీ ఫ్యాన్స్
ఆర్సీబీ 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ట్రోఫీ నెగ్గి విజయగర్వంతో సొంతగడ్డపై అడుగుపెట్టిన ఆర్సీబీ ప్లేయర్లకు ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. కర్ణాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్ స్వయంగా ఎయిర్ పోర్టుకు వెళ్లి బెంగళూరు టీమ్‌కు స్వాగతం పలికారు. విరాట్ కోహ్లీ, కృనాల్ పాండ్య, టిమ్ డేవిడ్, దినేశ్ కార్తిక్‌లకు ఆయన పుష్పగుచ్ఛం అందించి వెల్కమ్ చెప్పారు. అనంతరం బెంగళూరు జట్టు ప్రత్యేక బస్సులో విధాన సౌధకు చేరుకుంది. ఈ క్రమంలో వేలాది అభిమానులు ఆర్సీబీ జెండాలు చేతబూని విధాన సౌధ వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ‘ఎర్రసముద్రాన్ని’ తలపించింది.
CRAZY SCENES AT VIDHANA SOUDHA. 🥶🔥#RCB pic.twitter.com/G0HKRPcFYg
— Ritesh Sharma (@Ritesh_Sharma11) June 4, 2025
25 మందికి గాయాలు.. ఆరుగురి పరిస్థితి విషమం
అటు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద కూడా భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ‘ఆర్సీబీ’, ‘ఆర్సీబీ’ అంటూ నినాదాలు చేసి సందడి చేస్తున్నారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో ఏడుగురు మరణించినట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా బెంగళూరు’ తెలిపింది. మరో 25 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంది. కాగా ఆర్సీబీ ప్లేయర్లు స్టేడియానికి వస్తున్నారన విషయం తెలుసుకొని అభిమానులు ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ప్రస్తుతం చిన్నస్వామి పరిసరాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
🚨 TRAGIC NEWS! A stampede-like situation has been reported at Chinnaswamy Stadium as fans gathered to celebrate RCB’s win.
— 07 people, including a child, have reportedly lost their lives. pic.twitter.com/57SZJ5vAWy
— Megh Updates 🚨™ (@MeghUpdates) June 4, 2025






