Tollywood: 18న ఎగ్జిబిటర్లతో ఫిలీం ఛాంబర్ కీలక సమావేశం.. ఎందుకంటే?

థియేటర్లను అద్దె ప్రాతిపదికన(Theaters on rental basis) మీద కాకుండా, పర్సంటేజ్‌(Percentage)ల లెక్కన నడపాలనే వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. ఇప్పటికే ఈస్ట్, కృష్ణా, సీడెడ్, నైజాంల్లో ఈ నినాదం ఊపు అందుకుంది. దీంతో రెండు రాష్ట్రాల ఎగ్జిబిటర్ల(Exhibitors)తో ఫిలిం ఛాంబర్(Film Chamber) ఈ నెల 18న కీలక సమావేశం(Key meeting) నిర్వహించబోతోంది. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల వెనుక ఉండి ఆడిస్తున్న పెద్ద మనుషుల ఆట కట్టించాలనే ఆలోచనతో యాక్టివ్ నిర్మాతలు(Active Producers) కొందరు ప్రతి వ్యూహాలు రచించడం ప్రారంభించారు.

వారే కొత్త సిస్టమ్‌కు రెచ్చగొడుతున్నారా?

ఇక్కడ విషయం ఏమిటంటే దగ్గుబాటి సురేష్ బాబు(Daggubati Suresh Babu), ఆసియన్ సునీల్, దిల్ రాజు(Dill Raju)/శిరీష్ కలిసి ఎగ్జిబిటర్లను ఉసిగొల్పి, పర్సంటెజ్ సిస్టమ్‌కు రెచ్చగొడుతున్నారని యాక్టివ్ నిర్మాతలు అనుమానిస్తున్నారు. పర్సంటేజ్ సిస్టమ్ వస్తే పుష్ప(Pushpa) లాంటి భారీ సినిమాలకు కనీసం పది నుంచి ఇరవై కోట్లు నిర్మాతలకు నష్టం వస్తుందని అంటున్నారు. అదే నైజాంలో నలభై కోట్లు వసూలు చేసే సినిమాకు కనీనం ఏడెనిమిది కోట్లు నష్టం వస్తుందని నిర్మాతలు అంటున్నారు.

దిల్ రాజుకు బ్రేక్ వేసేందుకు

థియేటర్లు రన్ చేయలేకపోతున్నామని, పెద్ద సినిమాలకు రెంట్లు అంటున్నారని, రెండు వారాలు కాగానే షేరింగ్ మీద ఆడమంటున్నారని, ఇది కరెక్ట్ కాదు కదా అని ఎగ్జిబిటర్లు అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో పర్సంటేజ్ విధానానికి మద్దతు ఇస్తున్న శిరీష్/దిల్ రాజుకు బ్రేక్ వేయడానికి, మైత్రీ సంస్థతో చేతులు కలిపేందుకు సితార సంస్థ సిద్దం అవుతోందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *