దేశంలో కరోనా కేసులు(Corona Cases) మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్(AP)లో తొలి కరోనా పాజిటివ్ కేసు(Positive Case) నమోదై ప్రజల్లో ఆందోళన పెరిగింది. విశాఖపట్నం (Vizag) మద్దిలపాలెంకు చెందిన ఓ వివాహితకు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత కొన్ని రోజులుగా ఆమెకు జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రికి వెళ్లింది. అనుమానం వచ్చిన వైద్యులు RTPCR పరీక్ష నిర్వహించగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. సదరు మహిళతో పాటు ఆమె భర్త, ఇద్దరు పిల్లలకు కూడా వైద్యులు కొవిడ్ పరీక్ష(covid test) చేశారు. వారంతా నెగటివ్‌గా తేలారు. కాగా మహిళను వైద్యులు వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్(Quarantine)లో ఉండాలని సూచించారు.

దేశవ్యాప్తంగా 260 కరోనా పాజిటివ్ కేసులు
కరోనా కేసులు మళ్లీ కనిపిస్తున్న తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ(Health Department) విజ్ఞప్తి చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు(Masks) తప్పనిసరిగా ధరించాలన్న ఆరోగ్య శాఖ, శానిటైజర్ వినియోగాన్ని అలవాటుగా మార్చుకోవాలని సూచిస్తోంది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. ఇటు తెలంగాణ సర్కార్(Telangana Govt) కూడా అప్రమత్తమైంది. కరోనా పట్ల ప్రజలు జాగ్రతగా ఉండాలని సూచించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 260 కరోనా పాజిటివ్(Carona Positive) కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో అత్యధిక కేసులు గుర్తించారు.
)






