
మాజీ మంత్రి, YCP నేత కొడాలి నాని(Kodali Nani) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌లోని AIG (ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ) ఆస్పత్రికి తరలించారు. ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని, ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని సమాచారం. కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి గురించి స్పష్టమైన వివరాలు ఇంకా బయటకు రాలేదు కానీ, ఈ న్యూస్ ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. కాగా గుడివాడ నియోజకవర్గానికి చెందిన నాని గతంలో YCP ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.