
వచ్చే ఏడాది ఇంగ్లండ్ అండ్ వేల్స్(England and Wales) వేదికగా జరగనున్న ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్(Women’s T20 World Cup-2026) షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు బుధవారం ఐసీసీ(ICC) ఈ మెగా టోర్నీ షెడ్యూల్‌ను ప్రకటించింది. 2026 జూన్ 12న ఎడ్జ్‌బాస్టన్(Edgbaston) వేదికగా ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక(ENG vs SL) మ్యాచ్‌తో టోర్నీ ఆరంభమవుతుంది. మొత్తం 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. కాగా ఈ టోర్నీలో భారత్(India) తన తొలి మ్యాచ్ జూన్ 14న పాకిస్థాన్‌తో ఆడనుంది. క్వాలిఫయర్ జట్టు-1తో జూన్ 17న, సౌతాఫ్రికాతో జూన్ 21న, క్వాలిఫయర్ జట్టు-2తో జూన్ 25న, ఆస్ట్రేలియాతో జూన్ 28న తలపడనుంది. కాగా జూన్ 30, జులై 2న సెమీఫైనల్ మ్యాచులు జరగనుండగా.. ఫైనల్(Final) 2026 జులై 5న లార్డ్స్ వేదికగా జరుగుతుంది.
Grouo-1: ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇండియా, పాకిస్థాన్, 2 క్వాలిఫయర్ టీమ్స్
Group-2: వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, 2 క్వాలిఫయర్ జట్లు
Mark your calendars 🗓
The fixtures for the ICC Women’s T20 World Cup 2026 are out 😍
Full details ➡ https://t.co/X2BqQphwSC pic.twitter.com/gqkxaMudEP
— ICC (@ICC) June 18, 2025
ఇదిలా ఉండగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో మహిళల వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. భారత్(India), శ్రీలంక (Srilanka) సంయుక్త వేదికగా ఈ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్(ICC Womens ODI World Cup -2025) జరగనుంది. ఈ మేరకు ఇటీవల ఐసీసీ షెడ్యూల్(ICC Schedule)ను కూడా రిలీజ్ చేసింది. కాగా వరల్డ్ కప్ సిరీస్ ఫస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 30న బెంగళూరు చిన్నస్వామి స్డేడియం వేదికగా భారత్, శ్రీలంక(India vs Srilanka) మధ్య జరగనుంది.