దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSMB29 వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమం జరిగింది. ఇక షూటింగ్ కూడా ప్రారంభమైనట్లు సమాచారం. ఈ చిత్రంలో వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించనున్నట్లు తెలుస్తోంది.
SSMB29 షూటింగ్ ప్రారంభం
అయితే ఇప్పటివరకు కేవలం మహేశ్ బాబు (Mahesh Babu) పాత్ర తప్ప ఇంకెవరి పాత్రలకు సంబంధించి అధికారిక సమాచారం రాలేదు. అయితే ఇటీవల గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) లాస్ ఏంజెలెస్ నుంచి హైదరాబాద్ వచ్చింది. ఆమె మహేశ్ బాబు -జక్కన్న సినిమా కోసమే వచ్చిందని వార్తలు వచ్చాయి. ఇక తాజాగా సీజ్ ది పాస్ పోర్ట్ అంటూ రాజమౌళి ఓ పోస్టు పెట్టడంతో దానికి మహేశ్ బాబు, ప్రియాంకా రియాక్ట్ అయ్యారు.
విలన్ గా గ్లోబల్ స్టార్
ఇక ఈ సినిమా నుంచి రకరకాల అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలా తాజాగా ఓ న్యూస్ నెట్టింట ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది. అదేంటంటే.. SSMB29 మూవీలో గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రాను తీసుకున్నారన్న టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమె ఈ చిత్రంలో హీరోయిన్ అనుకున్నారు. కానీ ఈ భామ ఆ సినిమాలో లేడీ విలన్ గా నటించబోతోందట. ప్రస్తుతం ఈ వార్త బాగా వైరల్ అవుతోంది. ఇక హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటీని.. బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం (John Abraham)ను ఈ పాన్ ఇండియా సినిమాలో ఓ రోల్ కోసం సంప్రదింపులు చేస్తున్నారని సమాచారం.






