
అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం(Trade agreement) కుదరనుందన్న వార్తలు, అమెరికాలో జాబ్స్ డేటా(US Jobs Data) విడుదలవడంతో మార్కెట్లలో సానుకూలత ఏర్పడింది. దీంతో ఊహించిన దాని కంటే మెరుగ్గా యూఎస్‌లో ఉద్యోగ నియామకాలు జరిగాయి. ప్రస్తతం ఆర్థిక అనిశ్చితి తగ్గుముఖం పట్టడంతో సురక్షిత పెట్టుబడి అయిన బంగారానికి డిమాండ్(Gold Demand) తగ్గి రేట్లు భారీగా పడిపోయాయి. ఇటు పసిడి అత్యంత ఇష్టపడే భారత్‌లోనూ ధరలు ఈరోజు (జూన్ 7) భారీగా దిగివచ్చాయి.
హైదరాబాద్‌లో ధర ఎంతంటే?
ఇక శనివారం హైదరాబాద్(Hyderabad)లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి(Gold)పై రూ.1,630 పెరిగి రూ.97,970కు చేరింది. ఇక 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాములకు రూ.1,500 పెరిగి రూ.89,800 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండి(Silver) ధరల్లో ఎలాంటి మార్పుల్లేకుండా ప్రస్తుతం కేజీ వెండి రూ.1,18,000వద్ద ట్రైడ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.