
జూన్ నెలలో తగ్గిన బంగారం ధరలు(Gold Price)జూలై నెలలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. గ్లోబల్ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారులు(Investers)మళ్లీ బంగారం సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. దీంతో పసిడి ధరలు మళ్లీ నింగిని తాకేందుకు రెడీ అవుతున్నాయి. జూలై నెలలో మొదటి మూడు రోజుల్లోనే బంగారం ధరల్లో భారీ పెరుగుదల చోటు చేసుకుంది. 24 క్యారెట్ బంగారం ధర రూ.1 లక్ష మార్క్ కు దగ్గరలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ ఆందోళన కలిగిస్తున్న రాజకీయ పరిస్థితులు, పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరగడంతో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆందోళన కలిగిస్తున్న రాజకీయ పరిస్థితులు..
ఇక గురువారం (జూలై 3) హైదరాబాద్ బులియన్ మార్కెట్(Hyderabad Bullion Market)లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర (Gold Rate Today) 10 గ్రాముల పసడి రేటు రూ.440 పెరిగి రూ.99,330 వద్ద ట్రేడవుతోంది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400 పెరిగి ప్రస్తుతం రూ.91,050 వద్ద కొనసాగుతోంది. అటు ఏపీలోని విజయవాడ(Vijayawada), విశాఖపట్నం(Vizag)లోనూ దాదాపు ఇవే ధరలు అమలులో ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు (Silver Rate Today) పెరిగాయి. నిన్న కిలో వెండి ధర రూ.1,20,000 ఉండగా, ఈరోజు రూ.1000 పెరిగి రూ.1,21,000కు చేరుకుంది.