వయసు(Age) పైబడ్డాక సంపాదించడం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. ఆ సమయంలో పెన్షన్(Pension) లభిస్తే.. ఆ డబ్బు వారికి కాస్త ఆసరాని అందిస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికుల కోసం ప్రత్యేకంగా ఓ పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది. కార్మికులకు వృద్ధాప్య రక్షణ కల్పించేందుకు ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్-ధన్ (PM-SYM) అనే పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇంతకీ ఆ బెనిఫిట్స్(Benifits) ఏంటో చూద్దామా..
రూ.200 చెల్లిస్తే చాలు..
ఈ పథకం ద్వారా కార్మికులు(The workers) 60 ఏళ్లు నిండాక.. నెలకు రూ.3 వేలు పెన్షన్ పొందుతారు. అయితే అందుకోసం కార్మికుడు 60 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు(Savings) చేయాల్సి ఉంటుంది. కార్మికుడు చేసిన కాంట్రిబ్యూషన్‌కు సమానంగా ప్రభుత్వం కూడా నిధులను అందిస్తుంది. ఉదాహరణకు ఒక కార్మికుడు నెలకు రూ.200 చెల్లిస్తే, ప్రభుత్వం కూడా అదనంగా రూ.200 జమ చేస్తుంది.
* అర్హతలు
☛ వ్యవసాయ, భవన నిర్మాణ, బీడీ, చేనేత, తోలు, ఆడియో-విజువల్, వీధి వ్యాపారులు వంటి అసంఘటిత కార్మికులు ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు.
☛ నెలవారీ ఆదాయం రూ.15 వేల కన్నా తక్కువగా ఉండాలి.
☛ 18 నుంచి 40 ఏళ్ల వరకు ఎప్పుడైనా ఈ పథకంలో చేరవచ్చు.
☛ NPS, ESIC స్కీమ్స్(లేదా) ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) వంటి ఇతర పెన్షన్ పథకాల లబ్ధిదారులై ఉండకూడదు.
ఇలా అప్లై చేసుకోండి
అర్హత ఉన్న చందాదారులు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్స్(Common Service Centres)కు వెళ్లి ఈ పథకం కింద నమోదు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 3 లక్షలకు పైగా CSE సెంటర్లు ఉన్నాయి. అందులో ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పెన్షన్ పథకాన్ని ప్రారంభించేందుకు పొదుపు బ్యాంకు ఖాతా(Bank Account), జన్ ధన్ ఖాతా, ఆధార్ కార్డ్(Aadhar Card)లు ఉండాలి. సీఎస్సీలో వాటితో పాటు నామినీ వివరాలు సమర్పించాలి. సమాచారం వెరిఫై చేసిన తర్వాత, మీ అకౌంట్ ఓపెన్ చేసి, శ్రమ యోగి కార్డ్ అందిస్తారు. మరింత సమాచారం కోసం మాన్‌ధన్ యోజన అధికారిక వెబ్సైట్ https://labour.gov.in/pm-symను సందర్శించవచ్చు. లేదంటే టోల్ ఫ్రీ నంబర్ 1800 267 6888కి కాల్ చేయవచ్చు.