Amarnath Yatra 2025: అమర్నాథ్ యాత్ర షురూ.. నేడు బయల్దేరిన తొలి బ్యాచ్

దేశంలో అత్యంత ఆధ్యాత్మిక యాత్రల్లో ఒకటైన అమర్‌నాథ్‌ యాత్ర (Amarnath Yatra 2025)కు సర్వం సిద్ధమైంది. 38 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 9వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ యాత్ర కోసం ఇప్పటికే అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. కాగా దీనికోసం ఈ సంవత్సరం పెద్ద మొత్తంలో రిజిస్ట్రేషన్లు(Registrations) వచ్చాయి. అయితే మొన్నటి వరకు భారీ వర్షాలు(Heavy Rains) కురిసిన నేపథ్యంలో అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. దీంతో మొదటి బ్యాచ్ (First batch)ను ఈ రోజు జమ్మూకశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా(Governor Manoj Sinha) జెండా ఊపి ప్రారంభించారు. ఈ మేరకు జమ్మూ నుంచి తొలి బ్యాచ్ బయలుదేరింది.

42,000 మంది జవాన్లతో భద్రత

పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam terror attack) నేపథ్యంలో ఈ యాత్రకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అమర్‌నాథ్ యాత్ర మార్గాన్ని నో ఫ్లైజోన్‌(No Fly Zone)గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ యాత్ర బాల్తాల్, పహల్గామ్ మార్గాల ద్వారా ప్రారంభమై, ఆగస్టు 9న రక్షా బంధన్ రోజు ముగుస్తుంది. భద్రతా కారణాలతో, 42,000 మంది జవాన్లతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. RFID ట్యాగ్‌ల ద్వారా యాత్రికుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *