
ఎల్లుండి (జూన్ 27) రిలీజ్ కానున్న కన్నప్ప(Kannappa) మూవీకి షాక్ తగిలింది. కన్నప్ప సినిమా నిర్మాతలు IT, GST ఎగవేసినట్లు ఆరోపణలతో హీరో మంచు విష్ణు(Manchu Vishnu)తో పాటు సినిమాలోని పలువరి ఇళ్లలో జీఎస్టీ అధికారులు(GST officials) తనిఖీలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్(Madhapur)లోని విష్ణు కార్యాలయంలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సినిమా బడ్జెట్(Movie Budget)కు సంబంధించిన ఖర్చులు, బ్యాలన్ షీట్లను పరిశీలిస్తున్నారు. ఏ ఏ అకౌంట్ల నుంచి నిధులు ట్రాన్స్ఫర్ అయ్యాయి. TAX, GST ఎంత వరకు చెల్లించారనే కోణంలో సోదాలు జరుపుతున్నారు. విషయం తెలుసుకున్న మోహన్ బాబు(Mohan Babu) హుటాహుటిన విష్ణు ఆఫీస్‌కు వచ్చారు. అయితే ఐటీ, జీఎస్టీ రైడ్స్ గురించి తనకు తెలియదని.. సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నట్లు మంచు విష్ణు తెలిపారు.
GST officials conduct searches at Manchu Vishnu’s office
GST officials conducted searches at Tollywood hero Manchu Vishnu’s office. It is learned that these searches were conducted in the backdrop of Kannappa being released on the 27th of this month. GST officials are conducting… pic.twitter.com/68MAlMajEr
— Hyderabad Mail (@Hyderabad_Mail) June 25, 2025
రూ.200 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారని వార్తలు
కాగా సుమారు రూ.120 నుంచి రూ.200 కోట్ల బడ్జెట్‌తో సినిమాను నిర్మించారని వార్తలు వస్తున్నాయి. గతంలో కన్నప్ప బడ్జెట్(Kannappa Budget) గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడు ఆయన ఇంట్లో, చిత్రయూనిట్ సభ్యుల ఇళ్లలో జీఎస్టీ అధికారులు సోదాలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. కాగా ఈ పాన్ ఇండియా మూవీ జూన్ 27న విడుదల కానుంది. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ ప్రభాస్(Prabhas), మలయాళ స్టార్ మోహన్ లాల్(Mohan lal), బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) తదితరులు పలు కీలక పాత్రల్లో నటించారు.