దక్షిణాది సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటుడిగా పేరు తెచ్చుకున్నాడు విజయ్ సేతుపతి(Vijay Sethupathi). కెరీర్ ప్రారంభంలో చిన్న పాత్రలతో అడుగుపెట్టిన ఈ నటుడు, ఇప్పుడు హీరోగానూ, విలన్‌గానూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ తన సామర్థ్యాన్ని చూపిస్తూ పాన్ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషలలో కూడా విజయ్ సేతుపతికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
తెలుగులో ‘ఉప్పెన’ చిత్రంలో ‘రాయనం’ పాత్రతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసాడు. అప్పటి నుంచి తెలుగులోనూ ఆయన క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇటీవల విడుదలైన ‘మహారాజా’, ‘ఎస్’ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.
విజయ్ సేతుపతి నటనతో పాటు సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉంటారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు 8.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న విజయ్ మాత్రం కేవలం ఏడుగురినే ఫాలో అవుతున్నారు. ఆ ఏడుగురిలో ఒకే ఒక హీరోయిన్ ఉన్నారు, ఆమె ఎవరో తెలుసా?

విజయ్ ఫాలో అవుతున్న ఏకైక నటి తెలుగమ్మాయి అంజలి(Anjali). తమిళంతో పాటు తెలుగులోనూ ఎన్నో మంచి చిత్రాల్లో నటించిన అంజలికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి నటించిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. ఈ కాంబినేషన్‌కు కోలీవుడ్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ జంట తెరపై కనిపిస్తే థియేటర్లలో ఈలలే. అంజలి తెలుగులో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘వకీల్ సాబ్’ వంటి హిట్ చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.






