మీర్​పేట్ హత్య కేసులో కీలక పరిణామం.. గురుమూర్తి అరెస్ట్

రాష్ట్రంలో సంచలం సృష్టించిన మీర్​పేట్ హత్య కేసులో (Meerpet Woman Murder Case) పోలీసులు కీలక అడుగు ముందుకేశారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు తాజాగా నిందితుడు గురుమూర్తిని అరెస్ట్ చేశారు. భార్య వెంకట మాధవిని గురుమూర్తి ముక్కలుగా చేసి కిరాతకంగా హతమార్చిన ఎముకలను కాల్చి బూడిదను చెరువులో పడేసిన విషయం తెలిసిందే. అయితే తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నా.. ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు ఈ కేసులో అడుగు ముందుకేయలేకపోయారు.

గురుమూర్తి అరెస్టు

కానీ ఘటనాస్థలిలో పలు ఆధారాలు సేకరించిన పోలీసులు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ (Forensic Lab) కు పంపారు. తాజాగా ఫోరెన్సిక్ రిపోర్టు, కీలక ఆధారాలు ఆధారంగా నిందితుడు గురుమూర్తిని అరెస్టు చేశారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను వివరించనున్నారు.

అతను చాలా సాఫ్ట్

ఇక ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు గురుమూర్తి నేపథ్యం, అతడి ప్రవర్తన గురించి సహోద్యోగులు, స్థానికుల్ని విచారించగా ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గురుమూర్తి బ్యాక్ గ్రౌండ్ అంతా సాదాగా ఉందని.. అంత సామాన్యమైన ఇంత కిరాతకంగా హత్య ఎలా చేశాడన్నది అంతుబట్టడం లేదని పోలీసులు ఆశ్చర్యపడుతున్నారు. డీఆర్‌డీవోలో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్న గురుమూర్తి ఎంతో క్రమశిక్షణతో ఉంటాడని, చాలా మృదుస్వభావి అని అతడి సహోద్యోగులు చెప్పినట్లు సమాచారం.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *