Heavy Rain Forecast: భారీ వర్షాలు.. మూడు రోజులు జాగ్రత్త!

తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం(Hyderabad Meteorological Department Centre) భారీ వర్ష సూచన(Heavy rain forecast) చేసింది. ఈరోజు నుంచి వచ్చే మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy Rains) పడే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. అలాగే, గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

Weather alert: Heavy rain forecast issued for AP in next two days

ఇవాళ రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, గద్వాల, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇక, ఆంధ్రప్రదేశ్ లోనూ రెండు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. రాయలసీమ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విజయవాడ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

వర్షం ఏ జిల్లాలో ఏ రోజంటే..

ఆగస్టు 7, 2025 (గురువారం): హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో వర్షాలు పడతాయంది.

Wet weekend brings Hyderabad to a standstill - Telangana Today

ఆగస్టు 8, 2025 (శుక్రవారం): ఖమ్మం, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలు. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల జిల్లాకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *