
తెలంగాణ(Telangana)లో వాతావరణం(Weather) పూర్తిగా మారిపోయింది. గత నెలరోజులుగా భానుడి ప్రతాపానికి అల్లాడిన రాష్ట్ర ప్రజలకు గురువారం కాస్త ఉపశమనం కలిగింది. నేడు మధ్యాహ్నం ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఆకాశమంతా మేఘావృతమైపోయింది. దీంతో హైదరాబాద్(Hyderabad)లోని జూబ్లిహిల్స్, శ్రీనర్ కాలనీ, బంజారహిల్స్, సికింద్రాబాద్, నాంపల్లి, పటాన్‌చెరు, లింగంపల్లి, సచివాలయం, అబిడ్స్, బేగంపేట, అమీర్‌పేట సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం(Heavy Rain) కురుస్తోంది. దీంతో హైదరాబాద్‌లో ట్రాఫిక్(Traffic Jam) సిగ్నల్స్ దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అకాల వర్షం దెబ్బకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Irrumanzil, Hyderabad right now 😱⛈️⚠️
It’s just crazy intense storm for core city ⚡ pic.twitter.com/cYXwGFD6na— Telangana Weatherman (@balaji25_t) April 3, 2025
నాగర్‌కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం
అటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. అకాల వర్షాల కారణంగా నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పదర మండలంలో పిడుగుపాటు(Thunder)కు ఇద్దరు మృతి చెందారు. కూలీ పనులకు వెళ్లిన సమయంలో పిడుగు పడటంతో సుంకరి సైదమ్మ (35) ఈదమ్మ, (55) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో మహిళ సుంకరి లక్ష్మమ్మ గాయపడగా ఆమెను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.