
పెళ్లిళ్లు(Marriages), పండగలు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తుకువచ్చేది బంగార(Gold). అయితే ఎవరి స్తోమతకు తగ్గట్లు ఎంతో కొంత కొనుగోలు చేయడం కామన్. అంతలా ఈ పసిడి మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది. అలాగే అత్యవసర సమయంలో ఆర్థిక భరోసా ఇస్తుందని ఒక పెట్టుబడిగా(Investment)నూ సాధనంగానూ మారింది. అలాగే బంగారంతో పాటుగా వెండి(Silver)కీ మంచి గిరాకీ ఉంది. ఇక గత 5 రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. గత మూడు రోజుల్లో తులం బంగారం ధర దాదాపు రూ.2500 పెరిగి సరికొత్త రికార్డులకు చేరుకుంది. శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో పుత్తడి ధరలు ఇలా ఉన్నాయి.
☛ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,300 పలుకుతోంది.
☛ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.86,510గా నమోదైంది.
☛ ఇక కేజీ వెండ ధర రూ.100 తగ్గి రూ. 1,06,900 వద్ద కొనసాగుతోంది.
☛ ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు(Gold Rate) ఔన్సుకు 2860 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు(Silver Price) 32.24 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక ఇండియన్ రూపాయి విలువ(Rupee Value) రికార్డ్ స్థాయిలో పతనమవుతూ ఆందోళన కలిగిస్తోంది. డాలర్‌తో పోలిస్తే రూ.87.648 వద్ద కొనసాగుతోంది.
☛ స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, RBI వడ్డీరేట్ల సమీక్ష నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిఫ్టీ 23,586 (-17), సెన్సెక్స్ 78,035 (-22) వద్ద చలిస్తున్నాయి.