
భాగ్యనగరంలో ‘హైడ్రా(HYDRA)’ మరోసారి హడలెత్తిస్తోంది. అక్రమ నిర్మాణాలు(Illegal Constructures), ప్రభుత్వ స్థలాలు ఆక్రమణదారులపై కొరడా ఝుళిపిస్తోంది. చెరువులు, కుంటలు, నాళాల ఆక్రమణాదరుల అంతమే అజెండాగా పనిస్తోంది. ఇటీవల అమీన్‌పూర్(Ameenpur)లో పలు అక్రమ కట్టడాలను కూల్చివేసి హైడ్రా అధికారులు(Hydra officers) ఇవాళ (ఫిబ్రవరి 3) మళ్లీ అదే ఏరియాలో కూల్చివేతలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ చర్చనీయాంశంగా మారింది. హైడ్రా కూల్చివేతలు అని మూడు వార్తలు వస్తే అందులో రెండు అమీన్‌పూర్ నుంచే ఉంటున్నాయి. అసలు ఆ ప్రాంతంలో ఏం జరుగుతోంది? ఎందుకు హైడ్రా అధికారులు అక్కడే ఫోకస్ చేశారు? అనే వివరాలు తెలుసుకుందాం పదండి..
రేట్లు పెరగడంతో వారంతా రావడంతోనే..
అమీన్‌పూర్(Ameenpur)లో ఇటీవల అక్రమ కట్టడాలు అధికమైనట్లు హైడ్రా అధికారులు(Hydra officers) గుర్తించినట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఓ 15ఏళ్ల క్రితం అక్కడ స్థలాలు, పొలాలకు డిమాండ్ ఉండేది కాదు. చాలా తక్కువధర ఉండేది. ఇప్పుడు ఊహించనంతగా ధరలు(Rates) పెరిగిపోయాయి. ఓ చిన్న అపార్టుమెంట్ కూడా రూ.70/80 లక్షలకు తక్కువ కాకుండా అమ్ముతున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో రియల్ ఎస్టేట్(Real Estate) బంగారంగా మారడంతో ప్రభుత్వ భూముల్ని రాజకీయనేతలు చెరబట్టడం ప్రారంభించారు. ఆయా పరిశ్రమల్లో పని చేసేవారు ఓ సొసైటీగా ఏర్పడి అప్పట్లో పలు చోట భూములు కొనుగోలు చేశారు. అయితే మౌలిక సదుపాయాల లేమి(Lack of infrastructure) కారణంగా వాటిని అలా వదిలేశారు. కానీ రేట్లు పెరిగిన తర్వాత చాలా మంది ఆ భూములు తమవేనని క్లెయిమ్(Claim) చేసుకుంటూండటంతో సమస్యలు వస్తున్నాయి.
కోర్టు ఆదేశాలున్నా నిర్మాణాలు?
అమీన్ పూర్ మండలం ఐలాపూర్(Ailapur) గ్రామంలోని సర్వే నంబర్ 119 నుంచి 220 వరకు ఉన్న 408 ఎకరాల భూముల్లో చాలా ఏళ్ల కిందట 3,800 మంది అక్కడ గ్రామపంచాయతీ లేఔట్‌లో ఇంటి స్థలాలు కొని రిజిస్టర్ చేసుకున్నారు. కానీ ఇతర వ్యక్తులు ఆ స్థలం తమదని చెప్పి అమ్మేస్తున్నారు. కోర్టు ఆదేశాలు(Court Orders) ఉన్నా.. నిర్మాణాలు జరుగుతున్నాయి. అమీన్ పూర్ పెద్ద చెరువు ప్రాంతంలో ఓ రాజకీయ నాయకుడు చెరువు సమీపంలోని తమ ప్లాట్లను ఆక్రమించుకుని లేఔట్ అభివృద్ధి చేయడంతో కూల్చి వేశారు. ఇక కిష్టారెడ్డిపేట, బీరంగూడ(Kishtareddypet, Beeranguda) వంటి ప్రాంతాల్లో అనేక ఆక్రమణలు ఉన్నాయి. హైడ్రా వారందరికీ నోటీసులు(Notices) జారీ చేసింది. ఈ కారణాలతోనే హైడ్రా అమీన్‌పూర్‌లో ఎక్కువగా ఫోకస్ చేసినట్లు సమాచారం.