నేనెక్కడికీ వెళ్లలేదు.. వచ్చి ఛాయ్‌ తాగి వెళ్లొచ్చు: KTR

ManaEnadu:అరెస్ట్ చేస్తారనే భయంతో తాను మలేషియా(Malaysia) పారిపోయానంటూ వస్తున్న వార్తలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR స్పందించారు. ‘నేనెక్కడికీ వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నా. ఎవరైనా నా దగ్గరకు రావచ్చు. ఉస్మానియా బిస్కెట్లు తిని, ఛాయ్‌ తాగి వెళ్లొచ్చు. ముఖ్యంగా రేవంత్ బర్త్ డే కేక్ తీసుకొచ్చినా కట్ చేస్తా. హ్యాపీ బర్త్ డే సీఎం రేవంత్(Happy birthday CM Revanth)’ అంటూ ఆయన (X)లో ట్వీట్ చేశారు. కాగా మలేషియా తెలంగాణ అసోసియేషన్(Malaysian Telangana Association) దశాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొనేందుకు వెళ్తున్నట్లు తొలు తవార్తలు వచ్చాయి. తెలంగాణ ఏర్పాటైన 2014లో ఈ అసోసియేషన్‌ను KCR ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఆ వ్యవహారంలో విచారణ వేగవంతం

BRS ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ కారు రేస్(Formula eCar Race) వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది. ఒప్పందం కుదరడానికి ముందే నిధులు చెల్లించారని ఆరోపించింది. పైగా అందులోనూ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ రూపంలో ఇచ్చారని తెలిపింది. ఈనేపథ్యంలో ఈఘటనపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దీంతో KTR ఈ మేరకు స్పందించారు. ఈ విషయంలో తన నిర్ణయం తప్పని తేలితే జైలుకెళ్లేందుకైనా తాను సిద్ధమని స్పష్టం చేశారు.

 జైలుకు వెళ్లడానికైనా సిద్ధం: KTR

ఇదిలా ఉండగా CM రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటన నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. చిట్యాల(మ) పెద్దకాపర్తి వద్ద నకిరేకల్ మాజీ MLA చిరుమర్తి లింగయ్యను అదుపులోకి తీసుకున్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలో సీఎం ఇవాళ పాదయాత్ర చేయనుండటంతో BBనగర్, వలిగొండ ప్రాంతాల్లోనూ స్థానిక బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముందస్తు అరెస్టులను MLA హరీశ్ రావు ఖండించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *