Mana Enadu : భారత్ ఫాలోఆన్ తప్పించుకుంది. (Border Gavaskar Trophy) ఆసీస్‌తో పెర్త్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు (Ind vs Aus) తొలి ఇన్నింగ్స్‌లో సీనియర్లు తీవ్రంగా నిరాశపరచగా.. కేఎల్ రాహుల్, జడేజా పోరాటానికి తోడు చివర్లో ఆకాశ్ దీప్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో టీమిండియాకు ఫాలోఆన్ గండం తప్పింది. వెలుతురు లేమి కారణంగా నాలుగో రోజు ఆటను 14 ఓవర్ల ముందే అంపైర్లు నిలిపేశారు. ఆట ముగిసే సమయానికి టీమ్ ఇండియా 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది.
ఇద్దరే..
టాప్ ఆర్డర్లో కేఎల్ రాహుల్(84)కు (KL Rahul) తోడు జడేజా(77) పోరాటం చేయడంతో స్కోరు 200 దాటగలిగింది. ఆఖర్లో ఒక్కో పరుగు బుమ్రా(10*) , ఆకాశ్ దీప్ (27*) టీమ్ఇండియాకు ఫాలోఆన్ గండాన్ని తప్పించారు.
దోబూచులాడిన వరుణుడు
గబ్బాలో జరుగుతున్న మూడో టెస్టులో (Gabba Test) వరుణుడు దోబూచులాడాడు. మొదటి రోజు నుంచి ఆటంకం కలిగిస్తున్న వర్షం.. నాలుగో రోజు కూడా సవ్యంగా సాగనివ్వలేదు. ఇన్నింగ్స్ ప్రారంభం తర్వాత, టీ బ్రేక్ సమయానికి కూడా వర్షం అడ్డుతగిలింది. దీంతో చాలా సేపటి తర్వాత నాలుగో సెషన్ ప్రారంభమైంది. చివర్లో వెలుతురు కారణంగా 14 ఓవర్ల ముందే మ్యాచ్‌ను నిలిపివేశారు. భారత్ ఇంకా 193 పరుగుల వెనకంజలో ఉంది.






