SpaDeX Mission: పీఎస్‌ఎల్వీ సీ60 ప్రయోగం.. సమయంలో స్వల్ప మార్పు

  • DeskDesk
  • News
  • December 30, 2024
  • 0 Comments

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO) మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగ కేంద్రం(Sriharikota Rocket Launch Centre) నుంచి ఇవాళ PSLV C-60 రాకెట్‌ దూసుకెళ్లనుంది. ఎంతో కాలం నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘స్పెడెక్స్‌’ ప్రయోగాన్ని (Spadex mission) మరికొన్ని గంటల్లో చేపట్టనున్నది. ఇవాళ రాత్రి శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (SHAR) నుంచి PSLV-C60 రాకెట్‌ రెండు ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. ఇప్పటికే ఈ ప్రయోగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తికాగా నిన్న రాత్రి 8.58 నిమిషాల నుంచి కౌంట్‌డౌన్‌ కూడా ప్రారంభమైంది.

అయితే స్పెడెక్స్‌ ప్రయోగ(Spadex mission) సమయంలో స్వల్ప మార్పులు చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు(ISRO Scientists). ముందుగా రాత్రి 9:58 గంటలకు పీఎస్‌ఎల్‌వీ (Polar Satellite Launch Vehicle) C-60 రాకెట్‌ ద్వారా SDX-01 (ఛేజర్‌), SDX-02 (టార్గెట్‌) ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అనూహ్యంగా ఈ సమయంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. రాత్రి 9:58కి బదులుగా 10:15కు ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఈ మేరకు (X) వేదికగా ట్వీట్‌ చేసింది.

62 ప్రయోగాల్లో 59 సక్సెస్

ఇస్రోకి అచ్చొచ్చిన వాహక నౌకగా పేరుగాంచిన PSLV C-60 రాకెట్‌ ద్వారా ఈ ఉపగ్రహాన్ని ఇస్రో రోదసీలోకి పంపనుంది. PSLV సిరీస్‌లో ఇది 62వ ప్రయోగం కాగా ఇప్పటివరకు 59 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఇక PSLV కోర్‌ అలోన్ దశతో చేసే 18వ ప్రయోగమిది. ఇవి స్పేస్‌ డాకింగ్(Space docking), ఫార్మేషన్‌ ఫ్లయింగ్(formation Flying), మానవ అంతరిక్షయానం, తదితర సేవలకు ఉపయోగపడాతాయని ఇస్రో వెల్లడించింది.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *