
కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వ్యవహారమంతా ఓ ఫ్యామిలీ డ్రామా అని కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. అదో సినిమా అని, తెలంగాణలో కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ జరుగుతోందని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ (BRS) ఏనాడూ కలవవని పేర్కొన్నారు. కవిత అరెస్ట్ అవ్వకూడదని బీజేపీ(BJP)లో కలిసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ‘బీఆర్ఎస్లో చార్ పత్తా ఆట నడుస్తోంది. కల్వకుంట్ల సినిమాకు ప్రొడక్షన్ చేస్తున్నది కాంగ్రెస్. బీజేపీ–బీఆర్ఎస్ ఎప్పుడూ కలవవు. కవిత అరెస్ట్ కాకుండా ఉండేందుకు మా పార్టీతో కలిసేందుకు ప్రయత్నించారు. అవినీతి బీఆర్ఎస్తో తో బీజేపీ కలవదు. కాంగ్రెస్–భారాస మాత్రమే కలిసి పనిచేశాయి.
భారత సైన్యం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా..
వేములవాడ రాజన్న గోశాలలో కోడెలు చనిపోవడం బాధాకరమని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజన్న ఆలయం నిధులను మాజీ సీఎం వేరే చోట ఖర్చు చేశారని మండిపడ్డారు. ‘రాజన్న గోశాలలో కోడెలు చనిపోవడం బాధాకరం. ఈ ఘటనపై ఈవోతో మాట్లాడతానన్నారు. కోడెల సంఖ్యకు అనుగుణంగా గోశాలను విస్తరించాలి. రాజన్న ఆలయం నిధులను మాజీ సీఎం వేరే చోట ఖర్చు చేశారు. భారత సైన్యం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యలు ఉన్నాయి. పాక్‌పై యుద్ధం ఇంకా కొనసాగుతుందని ప్రధాని మోదీ చెప్పారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించే వరకు యుద్ధం కొనసాగుతుంది ’ అని సంజయ్ పేర్కొన్నారు.