
కేంద్ర ప్రభుత్వం(Central Govt) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకురావాలని భావిస్తున్న జమిలి ఎన్నికల(Jamili Elections)పై మరో ముందడుగు పడింది. ఇప్పటికే మంగళవారం లోక్ సభ(Lok Sabha)లో జమిలి ఎన్నికల బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్రం.. ఆ బిల్లు(Bill) తీర్మానంపై సాధారణ మెజారిటీ సాధించింది. అయితే జమిలి ఎన్నికల బిల్లు రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి పూర్తి స్థాయి ఆమోదం పొందాలంటే తప్పకుండా 3/2 మెజార్టీ అవసరం. దీంతో సమగ్ర చర్చల కోసం ఈ బిల్లులలను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (Joint Parliamentary Committee)కి పంపుతున్నట్లు కేంద్రం లోక్ సభలో వెల్లడించింది. అనుకున్నట్లుగా బుధవారం రాత్రి JPCని ఏర్పాటు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
జమిలి బిల్లుపై అధ్యయనం చేయడానికి కమిటీలో 31మంది MPలు ఉంటారు. అందులో లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10మంది ఉన్నారు. విపక్షాల తీవ్ర వ్యతిరేకత మధ్య లోక్‌సభ, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే రెండు బిల్లులను కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. వాటిని JPCకి పంపాలంటే ముందు లోక్‌సభ తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత జేపీసీని స్పీకర్ ఏర్పాటు చేస్తారు. దీనిపై 360 మంది ఎలక్ట్రానిక్ ఓటింగ్‌లో, మరికొందరు బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేశారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటు వేశారు.
జేపీసీ కమిటీలో ఉన్న MPలు వీరే..
1. పీపీ చౌదరి
2. సీఎం రమేశ్
3. భన్సూరి స్వరాజ్
4. పురుషోత్తంభాయ్ రూపాలా
5. అనురాగ్ సింగ్ ఠాకూర్
6. విష్ణు దయాల్ రామ్
7. భర్తృహరి మెహతాబ్
8. సంబిత్ పాత్ర
9. అనిల్ బలూనీ
10. విష్ణుదత్ శర్మ
11. ప్రియాంకా గాంధీ
12. మనీష్ తివారీ
13. సుఖ్‌దేవ్ భగత్
14. ధర్మేంద్ర యాదవ్
15. కళ్యాణ్ బెనర్జీ
16. టీఎం సెల్వగణపతి
17. జీఎం హరీశ్ బాలయోగీ
18. సుప్రియా సూలే
19. శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే
20. చందన్ చౌహాన్
21. బాలాశౌరి వల్లభనేని
వీరితోపాటు రాజ్యసభ నుంచి మరో 10 ఎంపీలు జేపీసీ కమిటీ సభ్యులుగా ఉన్నారు.
#BreakingNews | 21 members from #LokSabha; 10 from #RajyaSabha in Joint Parliamentary Committee (JPC) for '#OneNationOneElection' pic.twitter.com/3eOxlLqPHo
— DD News (@DDNewslive) December 18, 2024