హష్‌ మనీ కేసు.. ‘డొనాల్డ్ ట్రంప్‌’కు భారీ షాక్‌

Mana Enadu : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (US Elections 2024) ఘనవిజయం సాధించి త్వరలో అధ్యక్ష పీఠం ఎక్కనున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌నకు భారీ షాక్ తగిలింది. పోర్న్‌ స్టార్‌కు హష్‌ మనీ (Hush Money Case) కేసులో ఆయనపై నమోదైన అభియోగాలను కొట్టేసేందుకు న్యూయార్క్‌ కోర్టు తిరస్కరించింది. ఇలాంటి అనధికారిక ప్రవర్తన విషయంలో అధ్యక్షులకు రక్షణ వర్తించదని మన్‌హట్టన్‌ న్యాయమూర్తి జువాన్‌ మర్చన్‌ స్పష్టంచేశారు. ఇప్పుడు ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది.

కోర్టును ఆశ్రయించిన ట్రంప్

హష్‌ మనీ కేసులో డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఇప్పటికే దోషిగా తేలడంతో గత నెలలో న్యూయార్క్‌ కోర్టు శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. అదే సమయంలో అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నిక కావడంతో క్రిమినల్‌ విచారణ ఎదుర్కోకుండా రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ట్రంప్‌ కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం ఇటీవల విచారణ జరిపింది. ఈ కేసుకు సంబంధించిన శిక్షను నిరవధికంగా వాయిదా వేసింది.

ట్రంప్ కు షాక్

అయితే తాజాగా ఈ కేసులో ట్రంప్‌నకు రక్షణ కల్పించే అవకాశాలు లేవని మన్‌హట్టన్‌ న్యాయమూర్తి జువాన్‌ మర్చన్‌ స్పష్టం చేశారు. అధికారిక చర్యలకు సంబంధించిన కేసుల్లో మాత్రమే అధ్యక్షులకు రక్షణ ఉంటుందని  తెలిపారు. ఇలాంటి అనధికారిక ప్రవర్తన విషయంలో ప్రెసిడెంట్ కు రక్షణ వర్తించదని పేర్కొన్నారు. ఒకవేళ ఈ కేసులో ఆయనకు ఊరట లభించకపోతే.. శిక్ష అభియోగాలను ఎదుర్కొంటూ వైట్ హౌజులోకి అడుగుపెట్టే తొలి అధ్యక్షుడిగా ట్రంప్‌ నిలిచే అవకాశం ఉంది.

హష్‌ మనీ కేసు ఏంటీ ..?

పోర్న్ స్టార్ స్టార్మీ డానియల్స్‌ (Stormy Daniels)తో గతంలో ట్రంప్‌ ఏకాంతంగా గడిపారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె ఆ విషయంపై నోరు విప్పకుండా ఉండేందుకు ట్రంప్‌ తన న్యాయవాది ద్వారా స్టార్మీకి 1.30 లక్షల డాలర్ల హష్‌మనీని ఇప్పించారన్నది ఆరోపణ. అయితే  ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఈ నగదు ఆమెకు ఇచ్చారని.. ఇందుకోసం రికార్డులన్నీ తారుమారు చేశారన్నది అభియోగం. మొత్తం 34 అంశాల్లో ఆయనపై నేరారోపణలున్నాయి. ఆరు వారాల పాటు విచారించిన 12 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం.. విచారణ అనంతరం ట్రంప్‌పై మోపిన అభియోగాలన్నీ నిజమేనని తేల్చింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *