KA Movie: రిలీజ్‌కు ముందే ‘క’ రికార్డ్.. ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్!

Mana Enadu: కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘క(KA)’. ఈ సినిమాకు ఇద్దరు డైరెక్టర్లు సుజీత్, సందీప్(Sujeeth and Sandeep) దర్శకత్వం వహించారు. తన్వి రామ్, నయని సారిక హీరోయిన్లు(Tanvi Ram and Nayani Sarika)గా నటించారు. పీరియడ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ అయింది. దీంతో క సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికే ప్రీమియర్ షో(Premiere Shows)లతో ప్రేక్షకులను అలరిస్తోంది. దీపావళి(Diwali) ఫెస్టివల్ నేపథ్యంలో గురువారం (OCT 31న) పూర్తి స్థాయిలో ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈమూవీకి సంబంధించి ఓ క్రేజీ అప్డేడ్ వచ్చేసింది.

 నాలుగు వారాల తర్వాతే..

తాజాగా క మూవీకి సంబంధించి డిజిటల్ హక్కులు(Digital rights) ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ సొంతం చేసుకుంది. శాటిలైట్ రైట్స్ సమాచారం కూడా వెల్లడైంది. ఈటీవీ విన్(ETV Win) ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఈ మూవీ రైట్స్‌ను సొంతం చేసుకుంది. అలాగే, శాటిలైట్ హక్కులను కూడా ఈటీవీ రూ.10 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే థియేటర్లలో రిలీజైన 4 వారాల తర్వాత ‘క’ చిత్రం ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఇది థియేట్రికల్ రన్‍పై ఆధారపడి ఉంటుంది. ఈ మూవీకి లాంగ్ థియేట్రికల్ రన్ కొనసాగితే మాత్రం స్ట్రీమింగ్‍కు రావడం ఆలస్యం కావొచ్చు.

 పోస్ట్‌మ్యాన్‍ పాత్రలో కిరణ్

మధ్యాహ్నమే చీకటి పడే గ్రామంలో ఈ సినిమా స్టోరీ సాగుతుంది. ఈ చిత్రంలో పోస్ట్‌మ్యాన్‍(Postman) పాత్ర పోషించారు కిరణ్ అబ్బవరం. శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్‌పై(Shree Chakras Entertainment banner)పై చింతా గోపాలకృష్ణా రెడ్డి ఈ మూవీని నిర్మించారు. సామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. విశ్వాస్ డానియెల్, సతీశ్ రెడ్డి ఈ మూవీకి సినిమాటోగ్రఫీ చేయగా శ్రీ వరప్రసాద్ ఎడిటింగ్ చేశారు. కాగా ఈ మూవీకి సంబంధించి మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya) అతిథిగా హాజరయ్యారు.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *