శ్రద్ధా శ్రీనాధ్ (Shraddha Srinath), కిశోర్ ప్రధానపాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘కలియుగమ్-2064’ (Kaliyugam 2064). తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రమోద్ సుందర్ తెరకెక్కించారు. ఆర్.కె. ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కె.ఎస్. రామకృష్ణ నిర్మించారు. మే 9వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఒక్కొక్క అప్డేట్ వదులుతూ ప్రమోషన్స్ షురూ చేశారు.
కలియుగమ్ 2064
ఈ క్రమంలోనే తాజాగా కలియుగమ్-2064 సినిమా ట్రైలర్(Kaliyugam 2064)ను విడుదల చేశారు. 2064లో జరగబోతున్న కథను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. భవిష్యత్తులో మానవులు ఎలా జీవిస్తారు, ఎలా బతుకుతారు, ఎలా మరణిస్తారు అనే అంశాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని సమాచారం. టైం ట్రావెల్ కు సంబంధించిన సబ్జెక్టు ఎప్పుడూ ఆసక్తి కలిగిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఈ మూవీ ట్రైలర్ మీరు కూడా చూడండి.






