UI Film Review: ‘యూఐ’ మరో వరల్డ్ క్రియేట్ చేసిందా? ఉపేంద్ర న్యూ మూవీ రివ్యూ

ఉపేంద్ర (Upendra).. ఈ కన్నడ స్టార్ హీరో(Kannada star hero) గురించి తెలియని వారుండరు. తెలుగు సినీ ఇండస్ట్రీలోనూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నాడు ఈ సీనియర్ హీరో. దర్శకుడి(Director)గా తన సినీ జీవితం ప్రారంభించినప్పటికీ నటుడిగా, కథా రచయితగా, పాటల రచయితగా, సంగీత దర్శకుడిగా, నేపథ్య గాయకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడీ నటుడు.

దాదాపు పదేళ్ల తర్వాత ఉపేంద్ర దర్శకత్వం

తాజాగా ఆయన నటించిన మూవీ యూఐ(UI). దాదాపు పదేళ్ల తర్వాత ఉపేంద్ర దర్శకత్వం వహించి, హీరోగా ‘యూఐ’లో నటించాడు ఉపేంద్ర. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ శుక్రవారం (డిసెంబర్ 20న) విడుదలైంది. ‘UI’ అంటే ఏంటి? అందులో ఏం చెప్పారు. ఆయన నటన, దర్శకత్వం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించాయి అన్నది తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే..

సినిమా రివ్యూ: యూఐ (UI)
విడుదల తేది: 20–12–2024
నటీనటులు: ఉపేంద్ర (Upendra) రేష్మ నానయ్య(Reshma), సాధుకోకిల, జిషుసేన్‌ గుప్తా, రవిశంకర్‌, అచ్యుత్‌కుమార్‌, మురళీ శర్మ తదితరులు.
సినిమాటోగ్రఫీ: హెచ్‌.సి వేణుగోపాల్‌
సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌
ఎడిటింగ్‌: విజయ్‌రాజ్‌ బి.జి
నిర్మాతలు: జి.మనోహరన్‌, శ్రీకాంత్‌ కె.పి
కథ-స్ర్కీన్‌ప్లే-డైరెక్షన్: ఉపేంద్ర (Upendra)

స్టోరీ ఏంటంటే..

జేబు దొంగ వామనరావు (Ravishankar) సామ్రాట్‌, రాజకీయ నాయకుడు అవుతాడు. అతనికి బానిసలుగా ఉన్న ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కుల మతాలకు అతీతంగా ఒక కొత్త సమాజ స్థాపన కోసం సత్య (Upendra), అతని తండ్రి శాస్త్రి (Achyut Kumar) కృషి చేస్తుంటారు. వృత్తిరీత్యా శాస్త్రి ఓ జ్యోతిష శాస్త్ర నిపుణుడు(Astrologer). సత్య జన్మ నక్షత్రం ప్రకారం అతను కలియుగ భగవంతుడు అని శాస్త్రి ప్రకటిస్తాడు. వామనరావును సెంట్రల్‌ సామ్రాట్‌ చేస్తానని చెప్పిన కల్కి(Kalki) ఏం చేశాడు. కల్కిగా వచ్చినది సత్య కాదని, సత్య కవలలు అని ప్రజలతో పాటు వామనరావు తెలుసుకున్నాడా లేదా? సత్య, కల్కి మధ్య వ్యత్యాసం ఏంటి? సమాజానికి వాళ్లిద్దరూ ఏం చేశారు? అనేది మిగతా సినిమా.

ఎవరెలా నటించారంటే..

ఉపేంద్రకు ఓ స్టైల్‌(Style) ఉంది. ఆ స్టైల్లోనే యాక్ట్‌ చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఉపేంద్ర తప్ప మిగతా నటీనటుల గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు. హీరోయిన్‌ మాత్రం గ్లామర్‌(glamour) కోసం అలా ఉందంతే. రవిశంకర్‌ వెరైటీ గెటప్పులతో కనిపించాడు. డైరెక్టర్‌గా ఉపేంద్ర చెప్పాలనుకున్నది స్ట్రెయిట్‌గా చెప్పలేదు. అజనీష్‌ లోక్‌నాథ్‌(Ajanish Loknath) చక్కని సంగీతం, నేపథ్య సంగీతం బావుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌(VFX) వర్క్స్‌ కూడా బాగా చేయించారు. స్ర్కీన్‌ మీద ఒక డిఫరెంట్‌ వరల్డ్‌ క్రియేట్‌ చేశారు. పాటలు పెద్దగా ఏం అర్థం కావు.

Rating: 2.25/5

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *